Samantha : సమంత ధరించిన ఈ చెప్పుల ధర ఎంతో తెలిస్తే షాకే..!
NQ Staff - May 31, 2023 / 09:50 AM IST

Samantha : ఈ నడుమ సెలబ్రిటీలు చాలా లగ్జరీ లైఫ్ ను మెయింటేన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎవరూ ఊహించనంత ధర ఉన్న కాస్ట్యూమ్స్ ను ధరిస్తున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా బయట కూడా చాలా కాస్ట్లీ వస్తువులు వాడుతున్నారు. వారు చేతికి పెట్టుకునే వాచ్ లు, షూలు, చెప్పులు ఇలా అన్ని భారీ ధర కలిగి ఉన్నవే వాడుతున్నారు.
రీసెంట్ గా పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి విషయాలతోనే వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా సమంత కూడా ఇదే పని చేసింది. ఆమె ఇప్పుడు వరుస సినిమా షూటింగులతో చాలా బిజీగా ఉంటుంది. సిటాడెల్ సిరీస్, ఖుషీ సినిమాలతో పాటు మరో హాలీవుడ్ సినిమాకు కూడా ఆమె ఓకే చెప్పింది.
దాంతో తరచూ ముంబై, వివిధ ప్రాంతాలకు వెళ్లి వస్తోంది. తాజాగా ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరాల కంటికి చిక్కింది. ఇందులో ఆమె వేసుకున్న చెప్పుల ధర ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ చెప్పుల ధర రూ.2,58,097గా ఉందని తెలుస్తోంది. కేవలం చెప్పులకే ఆమె ఈ రేంజ్ లో డబ్బులు పెట్టిందంటే మామూలు విషయం కాదు.
కానీ సమంతకు ఉన్న రేంజ్ కు అదేమంత పెద్ద విషయం కాదని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. త్వరలోనే ఆమె నటించిన ఖుషీ సినిమా గురించి మరో అప్ డేట్ రానుందని తెలుస్తోంది. ఇక సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి సమంత ముందు ముందు ఇంకా ఏ సినిమాలో నటిస్తుందో.
????????
Gorgeous #Samantha seen slaying the airport look like a pro as she departs from Hyderabad!! ????✈️@Samanthaprabhu2 #Kushi #TeluguFilmNagar pic.twitter.com/XLFngBjo5j— Telugu FilmNagar (@telugufilmnagar) May 28, 2023