డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ కు రాష్ట్రపతి నివాళి

Advertisement

నేడు ఉపాధ్యాయ దినోత్సవం, మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆయన చిత్ర పటానికి ‌ నివాళి అర్పించారు. ఇక టీచర్స్ డే ను పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్‌లో నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్రపతి భవన్‌ సిబ్బంది, రాధాకృష్ణన్‌ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాంనాథ్ కోవింద్ మాట్లాడుతూ సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత కేవలం గురువుల కు మాత్రమే ఉందని కొనియాడారు. ప్రతిఒక్కరు గురువులను పూజించాలని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here