PREMA KADANTA: డిఫ‌రెంట్ టైటిల్‌తో వ‌స్తున్న అల్లూ వార‌బ్బాయి.. ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

యంగ్ హీరో అల్లు శిరీష్ మంచి హిట్ కోసం ఎంత‌గా త‌పిస్తున్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం గాడ్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా ఓ సినిమా చేస్తున్నాడు. గ‌త రెండు రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్స్ విడుద‌ల చేసిన మేక‌ర్స్ కొద్ది సేప‌టి క్రితం అను ఎమ్మాన్యుయేల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. రెండు పోస్ట‌ర్స్‌లోను ఇద్ద‌రు చాలా స‌న్నిహితంగా క‌నిపిస్తున్నారు. పోస్టర్ కు వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ వ‌స్తుండ‌గా, మూవీపై అంచ‌నాలు పెరుగుతున్నాయి.

ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని అల్లు వారబ్బాయి.. సాలిడ్ హిట్ కోసం ఈసారి తనలోని రొమాంటిక్ యాంగిల్ ని బయటపెడుతున్నట్లు ప్రీ లుక్స్, ఫ‌స్ట్ లుక్స్ చూస్తే అర్థమవుతుంది. అల్లు శిరీష్ – అను ఇమాన్యేయేల్ ఇద్దరూ కూడా గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. శిరీష్ నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన మలయాళ రీమేక్ ‘ఏబీసీడీ’ నిరాశ పరిచింది. ఇక అనూ బేబీ చివరగా చేసిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా ప్లాప్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరికీ ఓ హిట్ సినిమా అవసరం ఎంతైనా ఉంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ‘విజేత’ ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తుండ‌గా, మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్తైన‌ట్టు తెలుస్తుంది.