Pre Wedding Shoot In Panjagutta PS : పంజాగుట్ట పీఎస్ లో ప్రీవెడ్డింగ్ షూట్.. అడ్డంగా బుక్కైన ఎస్సై, ఏఆర్ ఎస్సై..!
NQ Staff - September 16, 2023 / 08:06 PM IST

Pre Wedding Shoot In Panjagutta PS :
దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ స్టేషన్ గా పేరు గాంచిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్.. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ కు వేదిక అయింది. ఈ వెడ్డింగ్ షూట్ చేసిన వారు బయట వారు కూడా కాదండోయ్.. ఏకంగా ఈ స్టేషన్ ఎస్సై, ఏఆర్ ఎస్సై. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో ఈ ఇద్దరిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న భావన.. అదే స్టేషన్ లో ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్న రావూరి కిషన్ తో కొంత కాలంగా ప్రేమలో ఉంది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెండ్లికి సిద్ధం అయ్యారు. అయితే పెళ్లికి ముందు జరుపుకునే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పోలీస్ స్టేషన్ నే వేదికగా చేసుకున్నారు.

Pre Wedding Shoot In Panjagutta PS
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అది కూడా యూనిఫామ్ లోనే వీడియో షూట్ చేశారు. పైగా పోలీస్ వాహనం తో చేశారు. దీంతో వీరిద్దరూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రజలు మండిపడుతున్నారు. వీరిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అటు పోలీస్ అధికారులు కూడా ఫైర్ అవుతున్నారు. ఇక్కట ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరి పెళ్లి ఆగస్టు 26న జరిగింది. కానీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.