“జాంబీ రెడ్డి” మూవీతో రానున్న ప్రశాంత్ వర్మ

Advertisement

హైదరాబాద్: అ! మూవీతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీని నాని నిర్మించగా, ఈ మూవీ లో కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యా మీనన్, ఈషా రెబ్బ నటించారు. . మొదటి చిత్రంతోనే ప్రశాంత్ వర్మ నేషనల్ లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. అ! మూవీ తరువాత కల్కి మూవీ తీశారు. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ తన తదుపరి చిత్రం యొక్క టైటిల్ ను ప్రకటించారు.

తెలుగులో మొదటిసారిగా జోంబీ చిత్రాన్ని తెరకెక్కించడానికి పూనుకున్నారు. ఈ చిత్రానికి జోంబీ రెడ్డి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ యొక్క మోషన్ పోస్టర్ ను ఇవ్వాలా విడుదల చేశారు. ఈ మూవీకి రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి రివెంజ్ ఆఫ్ ద డెత్ అనే క్యాప్షన్ ను పెట్టారు. కల్కి చిత్రంతో ప్లాప్ ను అందుకున్న ప్రశాంత్ ఈ మూవీతో మళ్ళీ ట్రాక్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన నటీ నటుల గురించి ప్రశాంత్ ఇంకా వెల్లడించలేదు. మొదటి జోంబీ చిత్రాన్ని ప్రశాంత్ ఎలా తెరకెక్కిస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here