Prashanth Neel Comments On Om Raut : కొందరు సీజీలో చేస్తే.. మేం దుమ్ములోనే చేస్తాం.. ఓంరౌత్ పై ప్రశాంత్ నీల్ సెటైర్లు..!
NQ Staff - June 28, 2023 / 10:03 AM IST

Prashanth Neel Comments On Om Raut : ప్రభాస్ అభిమానులు ఇప్పుడు సలార్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన భారీ వీఎఫ్ ఎక్స్ మూవీ ఆదిపురుష్ ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా బాగానే ఉన్నా.. హిట్ మాత్రం అందుకోలేకపోయింది. వరుసగా మూడు ప్లాపులు రావడంతో అందరి దృష్టి ఇప్పుడు సలార్ మీదనే పడింది.
అసలు ఆదిపురుష్ చాలా పెద్ద హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ దారుణమైన టాక్ వచ్చింది. అసలు రామాయణం కు సంబంధం లేని విధంగా ఉందంటూ విమర్శిస్తున్నారు. వీఎఫ్ ఎక్స్ కూడా చాలా వీక్ గా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. సలార్ సినిమా గురించి స్పందించారు. మీ సినిమాలు అన్నీ దుమ్ములోనే ఎందుకు ఉంటాయని అడగ్గా.. కొందరు సీజీలో సినిమాలు చేస్తారు. కానీ మేం మాత్రం దుమ్ములోనే చేస్తాం. అది మా కథకు బలం అంటూ చెప్పాడు. ఇది కూడా కేజీఎఫ్ లాగానే ఉంటుందా అని దానిపై కూడా స్పందించాడు.
సినిమా త్వరలోనే వస్తోంది. చూసి మీరే చెప్పండి అంటూ కామెంట్లు చేశాడు. అయితే ఆయన సీజీలో సినిమా చేస్తారు అని చెప్పడం మాత్రం ఓం రౌత్ ను ఉద్దేశించే చేసినట్టు ఉందని అంటున్నారు. ఇన్ డైరెక్ట్ గా ఓం రౌత్ లాగా వీక్ గ్రాఫిక్స్ తో సినిమాలు చేయకుండా.. బలమైన కథతో సినిమా చేస్తాం అని ప్రశాంత్ నీలు చెబుతున్నట్టు అర్థం అవుతోంది.