CM KCR : పీకేను పిలిపించిన కేసీఆర్.. అంచనాలు మారిపోతాయా..

NQ Staff - November 21, 2023 / 09:30 PM IST

CM KCR : పీకేను పిలిపించిన కేసీఆర్.. అంచనాలు మారిపోతాయా..

CM KCR :

తెలంగాణ ఎన్నికల్లో సీన్ మారబోతుందా? మొన్నటిదాక గెలుపుపై నమ్మకంగా ఉన్న కేసీఆర్ తాజా పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? విజయం వైపు కాంగ్రెస్ దూసుకెళ్తోందా? తాజా అంచనాలు అవే చెబుతున్నాయి. పలువురు స్ట్రాటజిస్టులు కూడా అదే చెబుతుండడంతో కేసీఆర్ మళ్లీ ప్రశాంత్ కిశోర్ ను పిలిపించినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారమవుతోంది. సర్వేలన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండడంతో అలర్ట్ అయిన గులాబీ బాస్.. పీకేతో మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది.

రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీకి ఎంతో వాల్యూ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నో పార్టీలను గద్దె ఎక్కించిన పీకేకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. పొలిటికల్ స్ట్రాటజిస్టులకు పీకే గురువు లాంటి వాడని చెప్పుకోవచ్చు. అలాంటి పీకే మొన్నటి దాక కేసీఆర్ సహకారం అందించాడు. మళ్లీ మధ్యలో ఏమైందో గాని చడీచప్పుడు లేకుండా డ్రాప్ అయ్యాడు. బీఆర్ఎస్ సొంతంగానే ప్రచార పర్వాన్ని సాగిస్తున్నది. సెలబ్రిటీలను తీసుకొచ్చి బీఆర్ఎస్ ను గెలిపించాలని పాటలు, యాడ్స్ చేయిస్తున్నది. అయిన కూడా కాంగ్రెస్ ప్రచార పర్వంలో దూసుకెళ్తుండడం.. సర్వేలన్నీ ఆపార్టీకి మంచి ఫలితాలు రానున్నాయని చెపుతుండడంతో కేసీఆర్ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. మూడో సారి అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కేసీఆర్ తపిస్తున్నారు. దీంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ఎన్నికలు కాక రేపుతున్నాయి.

ఇదిలా ఉండగా..దేశంలో పేరుగాంచిన స్ట్రాటజిస్టులు అందరూ కాంగ్రెస్ కు అనుకూలంగా ట్వీట్లు చేస్తుండడంతో ఆ పార్టీలో నయా జోష్ నెలకొంది. ఇంకా ఎన్నికలకు 9 రోజులే ఉండడంతో.. అప్పటిదాక తమ జోరు తగ్గించబోమని..దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త గురురాజ్ అంజన్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో సంచలన ట్వీట్ చేశారు.

సదరు ట్వీట్ లో ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్టు కేసీఆర్, కేటీఆర్ తో ప్రశాంత్ కిషోర్ ఈనెల 20న భేటి అయినట్టు పేర్కొన్నారు. దీంతో ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. దాదాపు 3గంటల పాటు వారు ఎన్నికల్లో గెలుపుపై చర్చించినట్టు ఆయన రాసుకొచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో అలర్ట్ అయిన గులాబీ బాస్.. పీకే కబురు పెట్టారని గురురాజ్ చెప్పుకొచ్చారు. రానున్న రోజులు కీలకం కావడంతో గెలుపు కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు చేసినట్టు చెప్పారు.

ఇంకా 9 రోజులు ఉండడంతో జనాల్లో పాజిటివ్ హైప్ తీసుకురావడం, కాంగ్రెస్ ను ఢీలా పడేలా చేయడం..సహ పోల్ మేనేజ్ మెంట్ పై ఆయన ట్వీట్ ను బట్టి తెలుస్తోంది. దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. తెలంగాణ ఎన్నికలపైనే అందరి ఫోకస్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడం బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు అత్యంత కీలకం. కాంగ్రెస్ కర్నాటకలో విజయ దుందుభి మోగించిన తర్వాత ఆ పార్టీకి కనుక తెలంగాణలో విజయఢంకా మోగిస్తే సౌత్ లోని కీలక రాష్ట్రాలు ఆ పార్టీ చేతిలో ఉన్నట్టే. ఇక ఇక్కడి నుంచి విజయనాదం.. ఉత్తరాదికి కూడా వ్యాపించేలా చేయాలని ఆ పార్టీ ప్లాన్. ఇక బీఆర్ఎస్ కు కూడా జీవన్మరణ సమస్యే. గెలవకుంటే ఆ పార్టీకి గడ్డు పరిస్థితే రానుంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వానేనా.. అనే రీతిలో తలపడుతున్నాయి. ఈక్రమంలో స్ట్రాటజిస్టుల ట్వీట్లు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us