Prashant Kishor : ప్రశాంత్ కిషోర్ వ్యూహం పన్నితే.. ప్రత్యర్థులకు పరాజయమే అని మరోసారి రుజువు

Prasanth Kishor : ప్రశాంత్ కిషోర్.. పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించింది ఈయనే. ప్రశాంత్ కిషోర్.. రాజకీయ వ్యూహకర్తగా బాగా పాపులర్ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఆయన పనిచేశారు. ఆయన వ్యూహాలు ఫలించి… వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ఆయన ఏ పార్టీకి పనిచేస్తే ఆ పార్టీ గెలవడమే తప్పితే ఓడిపోయే అవకాశాలే లేవు. అందుకే… ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయిపోయారు. సంచలనం సృష్టిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారంటే… ఇక ఖచ్చితంగా ప్రత్యర్థ పార్టీలు మూసుకోవాల్సిందే. ఓడిపోయామని ఫిక్స్ అయిపోయినట్టే. అది లెక్క.

prasanth kishore strategy wins in west bengal
prasanth kishore strategy wins in west bengal

ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి పెట్టిన తర్వాత ప్రశాంత్ కిషోర్ టీమ్… వెస్ట్ బెంగాల్ కు మకాం మార్చింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. వెస్ట్ బెంగాల్ లో కేవలం మమత పార్టీకే పనిచేయడం కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు ప్రశాంత్ కిషోర్. బీజేపీ పార్టీకే ఎదురు తిరిగారు. బీజేపీకి డబుల్ డిజిట్ కూడా దాటదంటూ సవాల్ విసిరారు. టీఎంసీ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. చివరకు మమతా బెనర్జీని మళ్లీ గెలపు పీఠం ఎక్కేలా చేశారు ప్రశాంత్ కిషోర్.

వెస్ట్ బెంగాల్ లో ప్రశాంత్ కిషోర్ టీమ్… వినూత్నంగా వ్యవహరించడం, వినూత్న ప్రచారాలు చేయడంతో… టీఎంసీ పార్టీ గెలిచింది. అలాగే… ఆయన వ్యూహకర్తగా వ్యవహరించిన తమిళనాడులోని డీఎంకే పార్టీ కూడా విజయం సాధించింది. అంటే… ప్రశాంత్ కిషోర్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమే తప్పతే పరాజయమే లేదు.. అని మరోసారి రుజువు అయింది. ప్రశాంత్ కిషోర్ ను చూసి ఇప్పుడు ప్రత్యర్థ పార్టీలన్నీ తెగ వణికిపోతున్నాయట. ఈయన ఎక్కడ తమ రాష్ట్రానికి వచ్చి తమ ప్రత్యర్థ పార్టీలతో కలిసి పనిచేస్తారో అని తెగ టెన్షన్ పడుతున్నారట. ఏది ఏమైనా.. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే వేరు. ఆయన ప్రజల నాడి తెలుసుకున్నారు. అందుకే… ఏ ఎన్నికల్లో అయినా తను పనిచేసే పార్టీని గెలిపిస్తున్నారు.

Advertisement