Viral News : ఇదేం పిచ్చి రా బాబు.. ప్రియురాలిపై కోపంతో మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు..!
NQ Staff - March 16, 2023 / 02:40 PM IST

Viral News : ఈ నడుమ జరుగుతున్న దారుణాలు చెప్పుకోలేని విధంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రేమికులు చేస్తున్న పనులు అయితే ఊహకు అందకుండా ఉన్నాయి. అమ్మాయి కోసం అబ్బాయిల్ని చంపేస్తున్నారు. ఇంకొందరు అయితే అమ్మాయిల్ని చంపేస్తున్నారు. ఇక తాజాగా ఓ యువకుడు ఇంకో అడుగు ముందుకు వేసి దారుణంగా ప్రవర్తించాడు.
బెంగాళ్ కు చెందిన ప్రసన్న జీత్ గుజరాత్ లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడ ఓ అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. ఆ అమ్మాయి కూడా అతని ప్రేమను అంగీకరించింది. దాంతో ఇద్దరూ సినిమాలు, షికార్లు అంటూ తిరుగుతున్నారు. ఇక తరచూ వీడియో కాల్స్ కూడా మాట్లాడు కుంటున్నారు.
గొడవ పడటంతో..
ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవలు బాగా పెరిగి పోయాయి. వీడియో కాల్స్ లో కూడా గొడవ పడుతున్నారు. రీసెంట్ గా మరోసారి వీడియోకాల్ చేసుకున్నారు. అందులో కూడా గొడవపడ్డారు. దాంతో కోపంతో ఊగిపోయిన అబ్బాయి.. వీడియో కాల్ మాట్లాడుతుండగానే పక్కనే ఉన్న బ్లేడ్ తో తన మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు.
అది చూసిన అమ్మాయి షాక్ అయిపోయింది. అప్రమత్తం అయిన కుటుంబ సభ్యులు ప్రసన్న జీత్ ను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రేయసి మీద ఉన్న కోపంతోనే ఆయన ఇలా తన మర్మాంగాన్ని కట్ చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.