మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రస్థానం

Advertisement

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్ను మూశారు. అయితే కొద్దీ సేపటి క్రితం ప్రణబ్ మృతి చెందారని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ అధికారికంగా వెల్లడించాడు. అయితే 1935 డిసెంబర్‌ 11న బెంగాల్‌లోని మిరాఠీలో జన్మించిన ప్రణబ్‌ స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నరు. ప్రణబ్‌ తండ్రి పేరు కె.కె.ముఖర్జీ. తన విద్యాబ్యాసం లోకి వెళితే కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పట్టా అందుకున్నరు ప్రణబ్. ‌అయితే 1957 జులై 13న సువ్రా ముఖర్జీని, ప్రణబ్‌ ముఖర్జీ వివాహం చేసుకున్నాడు. 2015లో ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ అనారోగ్యంతో మృతిచెందిరు. ఇక క్లర్క్‌ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు సాగిన ప్రణబ్ ప్రస్థానం, రాజకీయ ప్రవేశానికి ముందు పలు ఉద్యోగాలు చేసాడు ప్రణబ్. మొదట క్లర్క్‌గా, ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేసిన దెషర్ దక్ పత్రికకు పాత్రికేయులుగానూ పనిచేసాడు.

ప్రణబ్‌ ముఖర్జీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టాడు.
ప్రణబ్ 1969లో ఇందిరాగాంధీ హయాంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు. 34 ఏళ్లకే పెద్దల సభలో అడుగుపెట్టాడు.
1973లో ఇందిరాగాంధీ హయాంలో తొలిసారి మంత్రివర్గంలో ప్రణబ్‌కు
పరిశ్రమలశాఖ సహాయమంత్రిగా విధులు నిర్వహించాడు.
1975-77లో అంతర్గత అత్యవసర పరిస్థితిలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. 1982లో 47 ఏళ్ల వయసులోనే కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసాడు ప్రణబ్‌ ముఖర్జీ. ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక చక్రాలను పరుగులు పెట్టించాడు.

1982 నుంచి 1984 వరకు ఆర్థికమంత్రిగా కొనసాగాడు.
1986లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన ప్రణబ్‌
రాజీవ్‌గాంధీ సూచనతో ఆర్‌ఎస్‌సీని కాంగ్రెస్‌లో విలీనం చేసాడు. ‌
1991 నుంచి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసాడు.
1995లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసాడు ప్రణబ్‌ ముఖర్జీ.
1997లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్నాడు.
ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఎన్నో సమస్యలు పరిష్కరించాడు. గాంధేయవాదిగా, కరడుకట్టిన కాంగ్రెస్‌ వాదిగా మచ్చలేని నేతగా ప్రణబ్ ముఖర్జీ పేరు సంపాదించాడు.

యూపీఏ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించాడు. ‌
2004 నుంచి 2006 వరకు రక్షణ మంత్రిగా పనిచేసాడు.
2006 నుంచి 2009 వరకు విదేశీ వ్యవహరాల మంత్రిగా, 2009 నుంచి 2012 వరకు ఆర్థికమంత్రిగా సేవలు చేసాడు. కాంగ్రెస్‌లో వివాద పరిష్కర్తగా పేరు గడించాడు ప్రణబ్‌ ముఖర్జీ. 2012 జులై 25న భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాడు. ఇక 2017 వరకు రాష్ట్రపతి పదవిలో కొనసాగాడు ప్రణబ్‌ ముఖర్జీ. 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నాడు. 2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ను కూడా ప్రణబ్ ముఖర్జీ అందుకున్నాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here