మరింత క్షిణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

Advertisement

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ బులిటెన్ విడుదల చేసారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వెంటిలేటర్ సపోర్ట్ పై చికిత్స పొందుతున్నారని ఆర్మీ హాస్పిటల్ వెల్లడించింది.

ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఆయన ఆరోగ్యంపై ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది అని అంటున్నారు. ఒకవైపు ఆయన కుటుంబం ఏమో.. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నా సరే కోలుకుంటారు అనే నమ్మకం తమకు ఉందని అంటున్నారు. అయితే ఇటీవలే ఆయనకు ఒక సర్జరీ జరిగింది. ఇక అప్పటి నుండి ఆయన ఆరోగ్యం మరింత క్షిణించి విషమంగా మారింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here