Prakruti Mishra : ఛాన్సులిస్తానని వాడుకున్నాడు.. నిర్మాతపై హీరోయిన్ సంచలన ఆరోపణలు..!
NQ Staff - June 10, 2023 / 01:27 PM IST

Prakruti Mishra : ఈ భాష.. ఆ భాష అనే తేడాలు లేకుండా అన్ని భాషల్లో ఉన్న సినిమా ఇండస్ట్రీలలో వినిపిస్తున్న ఒకే ఒక్క మాట కాస్టింగ్ కౌచ్. ఇప్పటికే చాలామంది భామలు దీన్ని ఎదుర్కున్నారు. మీటూ ఉద్యమం తర్వాత కొందరు బయటకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది.
ప్రేమమ్ సినిమాలో నటించిన ప్రకృతి మిశ్రా అనే హీరోయిన్ తాజాగా ఓ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసింది. దాంతో ఆమెకు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా మద్దతు పలికారు. ఓటీవీ అనే ఒడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది ప్రకృతి. ఆమె మాట్లాడుతూ.. ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సంజయ్ నాయక్ పై ఆరోపణలు చేసింది.
సంజయ్ నాయక్ అవకాశాలు ఇస్తానని చెప్పి అమ్మాయిలను వాడుకుని వదిలేస్తున్నాడంటూ ఆరోపించింది. ఒడియా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. ఆయన చాలామందిని వాడుకున్నాడు అంటూ ఆరోపించింది. అయితే ప్రకృతి చేసిన ఆరోపణలకు హీరోయిన్ పుపుల్ భుయాన్, సీరియల్ నటి జాస్మిన్ రథ్ మద్దతు పలికారు.
ఒడియా ఇండస్ట్రీలో దాదాపు అందరూ మంచి వారే ఉన్నారని.. కాకపోతే సంజయ్ నాయక్ లాంటి వారే చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. దీంతో వారు చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి.