‘బుద్ధి లేదా వాళ్ళకి’ వాళ్ళ తీరు చూసి జగన్ కి మండింది మరి !

రాజకీయాలు ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో తెలియదు. ఈరోజు ఒక పార్టీ.. మరో రోజు మరో పార్టీ. ఇలా నేతలు తమకు ప్రాధాన్యత ఉన్న పార్టీ తీర్థం పుచ్చుకోవడం షరా మాములే. అయితే ఇప్పటి వరకు అధికార పక్షం, ప్రతిపక్షం నాయకులు ఇద్దరు విమర్శించుకోవడాన్ని మనం చూసే ఉంటాము. కానీ ఈసారి కాస్త కొత్తగా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు నీవా… నేనా సై అంటూ రోడ్డున పడ్డారు. అసలు వివరాలలోకి వెళితే..

ycp flag

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్య రాజకీయాలకు పోటి పడుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారా.. కారణం ఏంటంటే దర్శి నియోజకవర్గంలో 1955 నుంచి జరిగిన ఎన్నికలను ఒకసారి చూస్తే అప్పట్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా ఎక్కువగా ఉంది. 7 సార్లు కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించింది. తరువాత 2 సార్లు టీడీపీ గెలుపు సాధించింది. ఇక పోయిన ఏడాది మాత్రం వైసీపీ పార్టీ జెండా ఎగురవేసింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ తరఫున చివరిసారిగా 2004, 2009లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డీ విజయం సాధించారు. మళ్ళీ ఆయనే కాంగ్రెస్ పార్టీని వీడి, 2014లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ బూచేపల్లి ప్రసాద్ అ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సంవత్సరం ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించింది. టిడిపి పార్టీ తరుపున పోటి చేసిన శిద్దా రాఘవరావు విజయం దక్కించుకుని కేబినెట్ మంత్రి అయ్యారు. అయితే గత ఏడాది కూడా ఎన్నికల్లోనూ ఆయనే దర్శి నుంచి పోటీ చేయాలని అనుకున్నా.. చివరి నిముషంలో ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. దీంతో బలిజ సామాజిక వర్గానికి చెందిన కదిరి బాబూరావుకు పోటి చేసే అవకాశం ఇచ్చారు. అయితే ఆయన ఓడిపోయారు. తర్వాత ఇక్కడ నుంచి ఆయన వేరే చోటకి మారిపోయారు. దీంతో టీడీపీకి ఇక్కడ బలం చేకూర్చే వారు లేకుండా పోయారు. అటు చూస్తే శిద్దా కూడా వైసీపీలోకి చేరిపోవడం వల్ల ఇప్పుడు ఎటు చూసినా వైసీపీ జెండాలే ఎగురుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో విజయం సాధించిన మద్దిశెట్టి వేణుగోపాల్ హవా బాగుంది. ఇక్కడ ఓ విషయం గమనించాలి. అదేంటంటే.. 2014లో ఓడిపోయిన బూచేపల్లి, అప్పటి టీడీపీ మంత్రి శిద్దా రాఘవరావు వ్యూహంతో వైసీపీ కేడర్ టీడీపీలోకి చేరిపోవడంతో చేతులు ఎత్తేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోంటున్నానని ప్రకటించి.. జెండా వదిలేసారు.

జగన్ ఎంత చెప్పిన ఆయన పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇద్దరిని మార్చి చివరికి వేణుకు అవకాశం ఇచ్చారు. ఆయన మెజారిటీ ఓట్లతో గెలుపు సాధించారు. అప్పుడు వైస్సార్సీపీ పార్టీ ఒక దారికి వచ్చింది. ఇక్కడ దాక కథ బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ తెరపైకి బూచేపల్లి వచ్చారు. తన నియోజకవర్గం తనకే ఇవ్వాలని రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వేణుకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, ద్వితీయ శ్రేణి నేతలను రెచ్చగొట్టి వేణుకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వివాదంగా మారింది.

అయితే, ఎమ్మెల్యే వేణు కూడా అంతే బలంగా ఉన్నారు. గాడి తప్పి ఉన్న పార్టీని ఒక దారిలోకి తెచ్చి వైసీపీని నిలబెట్టానని, వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి నేనే పోటీకి దిగుతానని, ఈ విషయాన్నీ అధిష్టానం గమనించి, తనను అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు. అయితే.. బూచేపల్లికి బలమైన వైసీపీ నేతలు కొందరు అండగా ఉన్నారు. దీంతో చిన్న వివాదం పెద్ద గొడవగా మారుతుందని అంటున్నారు రాజకీయా వర్గాలు. ప్రస్తుతం ఇది జగన్ దగ్గరకు చేరింది.మరి ఆయన ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఒకవిధంగా చెప్పాలంటే ఇది జగన్ తలకు మించిన భారమే అని చెప్పాలి.ఈ ఇద్దరి నేతలను ఏలా బుజ్జగిస్టారో వేచి చూడాలి మరి..!

Advertisement