Pragya Jaiswal : అరెరె ప్రగ్యా.! వయ్యారాల వల విసిరెనె ఇలా.!

NQ Staff - November 26, 2022 / 10:33 PM IST

Pragya Jaiswal : అరెరె ప్రగ్యా.! వయ్యారాల వల విసిరెనె ఇలా.!

Pragya Jaiswal : నిండైన అందం, కన్నుల మెండుగా వున్నప్పటికీ ప్రగ్యా జైశ్వాల్‌ని తెలుగు మేకర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ‘కంచె’ సినిమాతో క్లాసిక్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ‘నక్షత్రం’, ‘జయ జానకి నాయకా’ తదితర సినిమాలతో తనలోని కమర్షియల్ యాంగిల్‌నీ బయటపెట్టింది.

కానీ, ప్రగ్యకు అవకాశాలు అంతంత మాత్రమే అనిపించాయ్. కొంత గ్యాప్ తర్వాత బాలయ్య పుణ్యమా అని ‘అఖండ’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాతో తిరుగులేని హిట్టు కొట్టిందన్న సెంటిమెంట్ కూడా చూపించడం లేదు ప్రగ్యా జైశ్వాల్ మీద.

ప్రగ్యా చాక్లెట్ మిల్క్ షైన్స్..

ఆ తర్వాత మళ్లీ మామూలే. సోషల్ మీడియా అందాల ఆరబోతకి మాత్రమే పరిమితమైంది ప్రగ్యా జైశ్వాల్ అందం. దొరికిన చోటే పండగ చేసుకోవాలన్న చందంగా, సోషల్ మీడియాలో అస్సలు తగ్గేదే లే.. అన్నట్లుగా గ్లామర్ పోజులిస్తుంటుందీ జబల్ పూర్ బ్యూటీ.

తాజాగా చాక్లెట్ కలర్‌ డ్రస్‌లో హాటెస్ట్ పోజులిచ్చి కేక పుట్టిస్తోంది అందాల ప్రగ్యజైశ్వాల్. అణువణువునా అంగాంగ ప్రదర్శన గావిస్తూ, కుర్రోళ్లకు ప్రేమ గిలిగింతలు పుట్టిస్తోంది. అన్నట్లు ప్రగ్యాకి బాలయ్య సినిమాలోనే మరో ఛాన్స్ దక్కిందన్న రూమర్లు వినిపిస్తున్నాయ్.

అయితే, అది జస్ట్ గెస్ట్ రోల్ అనీ తెలుస్తోంది. ఈ గాసిప్‌లో నిజమెంతో తెలీదు కానీ, బాలయ్య ఇచ్చినా ఇస్తాడు. చూడాలి మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us