Prabhas : హాలీవుడ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా.. ఇది నిజమేనా?

Prabhas : మీకు మిషన్ ఇంపాజిబుల్ సినిమా గుర్తుందా? హాలీవుడ్ లో చరిత్రను తిరగరాసిన సినిమా అది. ఆ సినిమా దర్శకుడు ఎవరో తెలుసా? క్రిస్టోఫర్ మెక్ క్వారీ. హాలీవుడ్ లో మంచి పేరున్న దర్శకుడు. ఇప్పటికే మిషన్ ఇంపాజిబుల్ సినిమా ఆరు సిరీస్ లు పూర్తయ్యాయి. తాజాగా మిషన్ ఇంపాజిబుల్ 7 సిరీస్ ను తీస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ స్పెషల్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. 2021 లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా వల్ల లేట్ అయింది. 2022 లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే.. ఈ సినిమాలో మన స్టార్ హీరో ప్రభాస్ ఓ కీ రోల్ చేస్తున్నారట. అదే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ రౌండ్లు కొడుతోంది. ప్రభాస్ కు హాలీవుడ్ ఆఫర్ వచ్చిందని.. మిషన్ ఇంపాజిబుల్ 7 సిరీస్ లో ఆయన నటిస్తున్నారంటూ వార్తలు కోడై కూస్తున్నాయి.

prabhas to act with hollywood director christopher
prabhas to act with hollywood director christopher

రాధేశ్యామ్ షూటింగ్ ఇటలీలో జరిగినప్పుడు.. ప్రభాస్.. క్రిస్టోఫర్ ను కలిశారని.. అప్పుడే సినిమాకు ప్రభాస్ సైన్ చేశారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. అసలు అది నిజమా? అబద్ధమా? అనే విషయం కూడా తెలియరాలేదు. దీంతో.. ఆగలేక ప్రభాస్ అభిమాని ఒకరు ఏకంగా క్రిస్టోఫర్ కు ట్వీట్ చేశాడు.

ఇండియా న్యూస్ చానెళ్లలో, సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇండియన్ యాక్టర్ ప్రభాస్ మీ సినిమా మిషన్ ఇంపాజిబుల్ 7 సిరీస్ లో నటిస్తున్నారా? దయచేసి కన్ఫమ్ చేయండి.. అంటూ క్రిస్టోఫర్ కు ట్వీట్ చేయడంతో.. ఆ ట్వీట్ కు స్పందించిన క్రిస్టోఫర్.. ప్రభాస్ చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. కానీ.. ఆయన్ను ఇప్పటి వరకు నేను కలవలేదు. ఆయనతో మాట్లాడలేదు. ఆయన గురించి ఇంటర్నెట్ లో చూడటమే.. అంటూ రిప్లయి ఇచ్చారు. దీంతో.. ప్రభాస్ హాలీవుడ్ సినిమా అంతా ఉత్తదే అని అప్పుడు క్లియర్ గా అందరికీ అర్థం అయిపోయింది.