Prabhas : తెలుగులో చరిత్ర తిరగరాసిన ప్రభాస్.. రూ.468 కోట్లతో తిరుగులేని రికార్డు..!

NQ Staff - June 13, 2023 / 10:34 AM IST

Prabhas : తెలుగులో చరిత్ర తిరగరాసిన ప్రభాస్.. రూ.468 కోట్లతో తిరుగులేని రికార్డు..!

Prabhas : ప్రభాస్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరోలకు లేనంత ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన ఇండియా స్టార్ అనే పేరుకు కరెక్ట్ మీగింగ్ అంటే కేవలం ప్రభాస్ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో సినిమాలు చేయనంత బిజినెస్ ను కేవలం ప్రభాస్ సినిమాలు మాత్రమే చేస్తున్నాయి.

ఇక తాజాగా ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.120 కోట్లు చేసింది. దాంతో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోలకు సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు ప్రభాస్. గతంలో ఆయన నటించిన బాహుబలి-2 సినిమాకు రూ.12..5 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ బిజినెస్.

ఇక దాని తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమాకు కూడా రూ. 121 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. అయితే ఇది ప్లాప్ కావడంతో దాని తర్వాత వచ్చిన రాధేశ్యామ్ సినిమాకు రూ.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలుపుకుని రూ. 105.20 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను జరిగింది.

ఇప్పుడు ఆదిపురుష్‌ కూడా భారీగా బిజినెస్ చేసుకుంది. ఇలా నాలుగు సినిమాలతో కలిపి ఇప్పటి వరకు రూ.468 కోట్ల బిజినెస్ చేశాడు ప్రభాస్. ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. నాలుగు సినిమాలతో ఏ హీరో కూడా ఇంతటి బిజినెస్ ను చేయలేదనే చెప్పుకోవాలి. దీంతో తెలుగులో ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడనే చెప్పుకోవాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us