Prabhas Srinu : నా తల్లితోనే అక్రమ సంబంధం అంటగట్టారు.. ప్రభాస్ శ్రీను ఎమోషనల్..!
NQ Staff - June 15, 2023 / 01:13 PM IST

Prabhas Srinu : కమెడియన్ గా ప్రభాస్ శ్రీనుకు మంచి పేరుంది. ఆయన ఇప్పటికే దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన సినిమాల్లో కమెడియన్ గా చేస్తూనే ప్రభాస్ వ్యవహారాలను దగ్గరుండి మరీ చూసుకుంటారు. ప్రభాస్ డేట్స్, ఇతర కార్యక్రమాలను ఆయనే ప్లాన్ చేస్తూ ఉంటారు. నటుడిగా బిజీగా ఉంటూనే అటు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో విషయాలను చూసుకుంటున్నాడు.
ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. షూటింగ్ సమయాల్లో కూడా రెబల్ స్టార్ విషయాలను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. ఇదిలా ఉండగా.. ఆయనపై గతంలో ఓ రూమర్ బలంగా వినిపించింది. ఆయనకు నటి తులసితో అక్రమ సంబంధం ఉందని అప్పట్లో వార్తలు రాశారు.
అయితే వాటిపై తాజాగా ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని సార్లు సోషల్ మీడియాలో వచ్చే వాటిని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు నటి తులసి గారితో అక్రమ సంబంధం అంటూ వార్తలు రాశారు. ఆమె నాకు తల్లితో సమానం.
డార్లింగ్ సినిమా సమయంలో ఆమెను నేను చాలా బాగా చూసుకున్నాను. ఆమె నన్ను ప్రేమగా డార్లింగ్ అని పిలుస్తుంది. మా ఇద్దరి నడుమ తల్లీ, కొడుకుల సంబంధం ఉంది. అలాంటి ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. చాలా ఎమోషనల్ అయ్యాను. కానీ ఆమె నాకు ధైర్యం చెప్పారు. ఇప్పటికీ ఆమెను నేను తల్లిగానే భావిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్ శ్రీను.