Prabhas : ప్రభాస్ అప్పులు మొత్తం తీర్చేసిన ఆదిపురుష్‌ మూవీ.. ఎలాగంటే..?

NQ Staff - May 31, 2023 / 08:29 AM IST

Prabhas : ప్రభాస్ అప్పులు మొత్తం తీర్చేసిన ఆదిపురుష్‌ మూవీ.. ఎలాగంటే..?

Prabhas  : ఇప్పుడు అందరి చూపు ఆదిపురుష్ మూవీపైనే ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదట్లో టీజర్ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ రీసెంట్ గా విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఓ రేంజ్ లో అంచనాలను పెంచేశాయి. దాంతో ఈ మూవీ గురించి అంతా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ మూవీకి సంబంధించిన తెలుగు రాష్ట్రాల రైట్స్ ను ప్రభాస్ కు అప్ప జెప్పారు నిర్మాతలు. దాంతో ఆయన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి రూ.185 కోట్లకు అమ్మేశారు. ఈ మొత్తంలో రూ.100 కోట్లను యూవీ క్రియేషన్స్ కు ప్రభాస్ ఇచ్చారని తెలుస్తోంది. గతంలో తనతో రాధేశ్యామ్ సినిమా తీయడం వల్ల యూవీ క్రియేషన్స్ అప్పుల్లో కూరుకుపోయింది.

దాంతో ఆ అప్పులను ప్రభాస్ ఈ విధంగా తీర్చాడని సమాచారం. ఇప్పటికే దిల్ రాజుకు రూ.40 కోట్లు యూవీ క్రియేషన్స్ ఇవ్వాల్సి ఉంది. ఆ మొత్తాన్ని సింగిల్ పేమెంట్ లో ఇచ్చేశారంట. ఇక అప్పుల్లో కూరుకుపోయి తన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న మరికొంత మందికి కూడా తిరిగి ఇచ్చేశారంట.

ఈ సినిమా జూన్ 16న థియేటర్లలోకి రాబోతోంది. ఈ విధంగా శ్రీరాముడి దయతో ప్రభాస్ యూవీ క్రియేషన్స్ అప్పులు మొత్తం తీర్చేశాడని తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా కూడా ఆడకపోతే మాత్రం భారీగా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాల్సి వస్తుంది. కానీ ప్రభాస్ మాత్రం సేఫ్ జోన్ లోనే ఉంటాడని తెలుస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us