Prabhas Salaar Movie Teaser New Update : ఓరినీ.. ప్రభాస్ కూడా జాతకాలు నమ్ముతున్నాడుగా.. ఈ పనులే సాక్ష్యం..!
NQ Staff - July 4, 2023 / 09:21 AM IST

Prabhas Salaar Movie Teaser New Update :
ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న నిర్మాతలు ఇప్పుడు ఆయనతో బడాసినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన మూవీలు అన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. అయితే బాహుబలి తర్వాత ఇప్పటి వరకు ఆయనకు హిట్లు పడలేదు. మూడు సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి.
దాంతో వేణుస్వామి లాంటి వారు ప్రభాస్ జాతకం బాగా లేదని.. ఇక అతను ఇంతకు మించి ఎదగలేడని చెబుతున్నారు. ప్రభాస్ చూడాల్సిన హైట్స్ అన్నీ చూసేశాడు. కాబట్టి ఇక తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేస్తే ఆయన జాతకం ప్రకారం కలిసి వస్తుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ కూడా ఇలా జాతకాలను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.
ఆ సినిమాలకు కూడా..
తాజాగా సలార్ టీజర్ అప్ డేట్ ఇచ్చారు. జులై 6వ తేదీన ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. అదేంటి.. ఎవరైనా టీజర్, ట్రైలర్ ను మధ్యాహ్నం లేదా సాయంత్రం రిలీజ్ చేస్తారు. అంతే గానీ ఇలా ఎవరూ నిద్ర లేవక ముందే ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే డౌట్ అందరిలో ఉంది.
అయితే ప్రభాస్ జాతకం ప్రకారం ఏ పని చేసినా ఉదయం పూట చేస్తేనే బాగా కలిసి వస్తుందంట. అందుకే గతంలో రాధేశ్యామ్, ఆదిపురుష్ టీజర్, ఫస్ట్ లుక్ లను ఇలా ఉదయం 8 గంటల లోపే రిలీజ్ చేశారు. అవి భారీగా వైరల్ అయి మూవీల మీద హైప్స్ పెంచాయి. ఇప్పుడు సలార్ విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నాడు.

Prabhas Salaar Movie Teaser New Update
సలార్ మూవీని ఉదయం 5.12 గంటకు రిలీజ్ చేస్తేనే బాగుంటుందని కొందరు పండితులు చెప్పినట్టు తెలుస్తోంది. ఇది చూశాక చివరకు ప్రభాస్ కూడా హిట్ కోసం జాతకాలు ఫాలో అవుతున్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఆయన ఫ్యాన్స్.