ప్రభాస్ నాగ్ అశ్విన్ ల సినిమా స్టోరీ ఇదే

Advertisement

బాహుబలి సినిమాతో ప్రభాస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ స్టాండర్డ్ ఏర్పడింది. దానితో ప్రభాస్ తరువాత సినిమాల పైన ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇక బాహుబలి తరువాత మరో పాన్ ఇండియా మూవీ ని ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో బారి అంచనాలను ఏర్పరిచింది. దానితో ఈ సినిమా గురించి చిన్న వార్త బయటకి వచ్చిన అభిమానులు ఆసక్తితో తెలుసుకుంటున్నారు

తాజాగా ఈ సినిమా కి సంబంధించిన హీరోయిన్ ఎవరో తెలియచేస్తూనే సినిమా స్టోరీ ఏంటో హింట్ ఇచ్చేసాడు దర్శకుడు నాగ్ అశ్విన్. రాజు కి సరిపోయే రాణి కావలి కదా అందుకే రాణి కి సరిగా సరిపోయే దీపికా పడుకొనే ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది అంటూ తెలిపాడు. అయితే ఇది వరకే ఒక దేవకన్యకి మానవునికి పుట్టిన కొడుకుకి గా హీరో ప్రభాస్ కనిపించనున్నాడు అని వార్తలు బయటకి వచ్చాయి. దానితో పాటు ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ అన్న విషయం కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే బాహుబలి లాగానే ప్రభాస్ కి మరల ప్రభాస్ పుట్టడం ఆ తరువాత అద్భుత శక్తులు కలిగిన ప్రభాస్ యుద్ధంలో ఎందుకు పాల్గొనవలసి వచ్చింది. అన్న కథగా ఒక సోసియో ఫాంటసీ తరహాలో ఈ సినిమా తెరకెక్కనుంది అంట.

ఈ పాన్ ఇండియా మూవీని బారి ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 500 కోట్లు పైమాటే. ఇప్పటి వరకు వచ్చిన సోసియో ఫాంటసి తరహా సినిమాలను ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. మరి ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని సాధిస్తుందో చూడాలి . ఇక ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వం లో ప్రభాస్ తీసిన రాధ్యేశ్యామ్ సినిమా కూడా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ మధ్యే ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రాధే శ్యామ్ సినిమాని ఈ కరోనా ప్రభావం తగ్గగానే థియేటర్ లలో విడుదల చేయనుండగా .. నాగ్ అశ్విన్ మరియు ప్రభాస్ ల సోసియో ఫాంటసీ సినిమాను 2022 లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here