Prabhas : ఆదిపురుష్ నుంచి అప్పుడే తప్పుకోవాలనుకున్న ప్రభాస్.. కొంప ముంచిన ఓం రౌత్..!
NQ Staff - June 22, 2023 / 11:36 AM IST

Prabhas : ప్రభాస్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన మూవీ ఆదిపురుష్. రామాయణం ఆధారంగా చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉండేవి. ప్రభాస్ కారణంగా ఈ మూవీపై అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. ఇందులో రాముడిగా ప్రభాస్ నటించగా.. కృతిసనన్ సీతగా నటించింది.
అయితే దర్శకుడు ఓం రౌత్ రామాయణంతో సంబంధం లేకుండా దీన్ని తెరకెక్కించాడు. అదే ఇప్పుడు పెద్ద మిస్టేక్ అయిపోయింది. దాంతో ఈ మూవీపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ గతంలో ఆదిపురుష్ సినిమాపై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, పూజాహెగ్డే ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అందులో ప్రభాస్ ను అప్ కమింగ్ మూవీస్ గురించి అడిగాడు యాంకర్. ప్రభాస్ స్పందిస్తూ నేను ఆదిపురుష్ మూవీ చేస్తున్నాను. షూటింగ్ నాలుగు రోజులు అయిన తర్వాత నేను ఓం రౌత్ ను అడిగాను.

Prabhas Made Adipurush Movie With Faith In Om Raut
రౌత్ నేను ఈ సినిమా చేయొచ్చా లేదా అని అడిగాను. అప్పుడు రౌత్ మాట్లాడుతూ.. కచ్చితంగా చేయొచ్చు. నేను ఉన్నాను. నన్ను నమ్ము అని చెప్పాడు అంటూ ప్రభాస్ అందులో క్లారిటీ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఓం రౌత్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. నీ వల్లే మా ప్రభాస్ ఈ సినిమా చేసి నష్టపోయాడు అంటూ విమర్శిస్తున్నారు.