Prabhas : ఏడాదిలోగా ఇండియాలోనే టాప్-1 హీరోగా ఎదగబోతున్న సౌత్ హీరో.. ఎవరంటే..?

NQ Staff - May 16, 2023 / 03:40 PM IST

Prabhas : ఏడాదిలోగా ఇండియాలోనే టాప్-1 హీరోగా ఎదగబోతున్న సౌత్ హీరో.. ఎవరంటే..?

Prabhas  : అవును.. మీరు విన్నది నిజమే. బాలీవుడ్ ను మించి మన సౌత్ హీరోల సినిమాలకు కలెక్షన్లు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మన తెలుగు హీరోల మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. దెబ్బకు వారి సినిమాలకు బాలీవుడ్ బ్రహ్మరథం పడుతోంది. టాలీవుడ్ నుంచే ఎక్కువ మంది పాన్ ఇండియా స్టార్ హీరోలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

కాగా వచ్చే ఏడాదిలోగా ఓ స్టార్ హీరో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశం ఉంది. ఆయన ఎవరో కాదు మన తెలుగు హీరోనే. అవును మీరు విన్నది నిజమే. అతనే మన డార్లింగ్ ప్రభాస్. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న సినిమాలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆదిపురుష్ రిలీజ్ కు రెడీగా ఉంది. దీని బడ్జెట్ రూ.450 కోట్లు.

ఇది కచ్చితంగా రూ.1000 కోట్ల బిజినెస్ చేస్తుంది. ఇక సలార్ మూవీ కూడా రూ.1000 కోట్ల బిజినెస్ చేస్తుంది. దీని తర్వాత వచ్చే ప్రాజెక్ట్ కే సినిమా కూడా రూ.2వేల కోట్ల బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టులు ప్రస్తుతం ఏ హీరో చేతిలో కూడా లేవు. ఇవన్నీ కచ్చితంగా కొత్త చరిత్రను సృష్టించే సినిమాలే అవుతాయని అంటున్నారు.

ఈ సినిమాల్లో ఏ రెండు హిట్ అయినా సరే ప్రభాస్ అమాతం నెంబర్ వన్ పొజీషన్ కు చేరుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా రికార్డు సృష్టించాడు ప్రభాస్. మరి ఆయన ఈ సినిమాలతో ఇంకెలాంటి చరిత్ర సృష్టిస్తాడో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us