ఆదిపురుష్ మూవీలో రాముడిగా నటించనున్న ప్రభాస్, కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్

Advertisement

ప్రభాస్ తన 22వ మూవీ యొక్క పోస్టర్ ను ఇవ్వాళ విడుదల చేశారు. ఈ మూవీకి ఆదిపురుష్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా, ఈ మూవీని ఓం రౌత్ దర్శకత్వం వహించనుండగా, టీ సిరీస్, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ యొక్క మోషన్ పోస్టర్ లో రామాయణానికి సంబంధించిన క్యారెక్టర్స్ కనిపించడంతో ఈ మూవీ ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తాడా లేక ఆ లక్షణాలు ఉన్న పాత్రలో నటిస్తారా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

అయితే ఇప్పుడు ఈ విషయంపై ప్రభాస్ 21వ మూవీకి దర్శకత్వం వహిస్తున్న నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ నటించడం తనకు సంతోషాన్ని కలిగించిందని, ఈ మూవీలో రాముడి పాత్రలో నటించడం మరింత సంతోషం కలిగిస్తుందని ట్వీట్ చేశారు. దీంతో ఈమూవీలో ప్రభాస్ చేయనున్న పాత్రపై ఊహాగానాలకు కళ్లెం వేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here