ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..!
Admin - August 20, 2020 / 09:25 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా తానాజీ అనే మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బారి బడ్జెట్ తో అత్యంత శ్రద్దగా చేస్తున్నారు చిత్ర బృందం. అయితే తానాజీ దర్శకుడు ఓం రావత్ డైరెక్షన్ లో “ఆదిపురుష్” అనే భారీ సినిమాను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అయితే దానికి సంబందించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడు అని ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాకు సంబందించిన మరో వార్త బయటకు వచ్చింది. ఇక ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ జోడిగా హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించనుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని ఖరారు చేసారు. ఇక ప్రభాస్ కి జోడిగా సీత పాత్రలో కీర్తి సురేష్ నటించనుంది అని సమాచారం వస్తుంది.