Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణం రాజు క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కృష్ణం రాజు రెబల్ స్టార్‌గా అభిమానుల మనసులలో నిలిచిపోయారు. ఆయనని స్పూర్తిగా తీసుకొని ప్రభాస్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈశ్వర్ సినిమా ప్రభాస్‌కు డెబ్యూ మూవీ కాగా, ఇది పెద్దగా అలరించలేకపోయింది. రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాతో ప్రభాస్‌కు క్రేజ్ పెరిగింది. మళ్ళీ రాజమౌళితో కలిసి బాహుబలి అనే సినిమా చేసిన ప్రభాస్ ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ బాలీవుడ్ హీరోల కన్నా ఎక్కువగానే ఉందనే చెప్పాలి. నిర్మాతలు ప్రభాస్‌తో సినిమా చేసేందుకు కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్‌తో పీరియాడికల్ మూవీస్ చేస్తుండగా, ఇవన్నీ కూడా పాన్ ఇండియన్ సినిమాలుగా రూపొందుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉండగా, పర్సనల్ లైఫ్ మాత్రంలో కాస్త వెలితి ఉందని అంటున్నారు అభిమానులు. నాలుగు పదుల వయస్సు దాటిన ప్రభాస్ ఇంకా పెళ్ళి చేసుకోకపోవడంతో అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
పెద్దనాన్నని అందంగా రెడీ చేస్తున్న ప్రభాస్: Prabhas
అయితే ఎప్పుడో పెళ్ళి చేసుకోవలసిన ప్రభాస్ ఇప్పుడు తన పెద్దనాన్న కృష్ణం రాజు పెళ్ళి కొడుకులా ముస్తాబు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తండ్రి సూర్యనారాయణ రాజు చనిపోయిన తర్వాత ప్రభాస్ ని కృష్ణంరాజు కన్న కొడుకులా చూసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగిపోయింది. జనవరి 20న కృష్ణం రాజు తన 81వ పుట్టిన రోజు జరుపుకోగా, ఆ రోజు ప్రభాస్ తన పెద్దనాన్నని అందంగా రెడీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇందులో తండ్రి,కొడుకుల మధ్య ఉన్న బంధం చూసి తెగ మురిసిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరి కొద్ది రోజులలో థియేటర్స్ లోకి రానుంది.