ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హీరో ప్రభాస్

Advertisement

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని ప్రభాస్ పరిశీలించారు. అటవీ ప్రాంతంలో మొక్కలు నాటి ఈ ప్రాంతాన్ని ప్రభాస్ అభివృద్ధి చేయనున్నారు. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామంది ప్రముఖులు మెచ్చుకుంటుంన్నారు.

బాహుబలి మూవీతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభాస్ ఇలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారు. కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ తన జిమ్ ట్రైనర్ కు ఒక రేంజ్ రోవర్ ను బహుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీ విడుదల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here