Prabhas Fans Trolling Prashanth Neel : సలార్.. కేజీఎఫ్ రీమేకా.. అసలు ఏం తీశావ్ నీల్ మావా.. దారుణమైన ట్రోల్స్..!
NQ Staff - July 6, 2023 / 09:40 AM IST

Prabhas Fans Trolling Prashanth Neel :
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సలార్ టీజర్ వచ్చేసింది. ఈ రోజు ఉదయం 5గంటల 12 నిముషాలకు టీజర్ ను రిలీజ్ చేశాడు. కాగా ఈ టీజర్ క్షణాల్లోనే రికార్డు వ్యూస్ తో దుమ్ములేపింది. కేవలం రెండు గంటల్లోనే 10 మిలియన్ల వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ టీజర్ చూసిన చాలామంది గూస్ బంప్స్ అంటుంటే.. కొందరు మాత్రం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఎందుకంటే టీజర్ లోని చాలా విషయాలు కేజీఎఫ్ లాగానే ఉన్నాయి. సలార్ టీజర్ లోని కలర్, బ్యాక్ గ్రౌండ్, హీరో ఎలివేషన్, విలన్ కాస్ట్యూమ్స్, డైలాగ్స్.. వాడిన వస్తువులు, లొకేషన్లు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ కేజీఎఫ్ లాగానే ఉన్నాయి. కేజీఎఫ్-2 లాగానే ప్రభాస్ ఎలివేషన్ ను ఓ ముసలాయనతో ఇంగ్లిష్ లో చెప్పించాడు నీల్.
ఇక ప్రభాస్ లుక్ ను పూర్తిగా చూపించకపోవడం మరో డిసప్పాయింట్. ఇక టీజర్ లో వాడిన బ్లాక్ థీమ్, హీరో ఎంట్రీ, హీరో గురించి చెప్పడం, యాక్షన్ సీన్, బీజీఎం స్టయిల్ చూస్తే.. కేజీఎఫ్ ను పోలినట్టే ఉన్నాయి. అందుకే మళ్లీ ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్` సినిమాని తీస్తున్నాడా అంటున్నారు.
కొత్తదనం ఏముంది..?

Prabhas Fans Trolling Prashanth Neel
సలార్ మూవీ ఏమైనా కేజీఎఫ్ కు రీమేకా అంటూ దారుణంగా ఆడేసుకుంటున్నారు. ఏదో అనుకుంటే ఇలా ఉసూరుమనిపించారే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే సలార్ కంటే కేజీఎఫ్-2 టీజర్ బాగుందని కామెంట్లు పెడుతున్నారు. అసలు సలార్ లో కొత్తదనం ఏముందని అడుగుతున్నారు.
ఏదో కేజీఎఫ్ ను చూసిన ఫీల్ ఉంది తప్ప.. అంతకు మించి ఇంకేమైనా ఉందా అని నిలదీస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్, విమర్శలను డార్లింగ్ ఫ్యాన్స్ తిప్పి కొడుతున్నారు. కావాలనే ప్రభాస్ హేటర్స్ ఇలా ట్రోల్స్ చేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా సలార్ టీజర్ పై ఇలాంటి ట్రోల్స్ రావడం మైనస్ అనే చెప్పుకోవాలి. ఇక ట్రైలర్ లోనే ప్రశాంత్ నీల్ నిరూపించుకోవాలి.