Prabhas : ‘బింబిసార’ ఎఫెక్ట్: అభిమానులకు షాక్ ఇచ్చిన ప్రభాస్
NQ Staff - August 2, 2022 / 11:00 PM IST

Prabhas : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారామం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న విషయం విదితమే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మండన్న ఈ సినిమాలో ప్రధాన తారాగణం.

Prabhas don’t want to come for Sitaramam pre release event due to bimbisara
ఇదిలా వుంటే, ‘సీతారామం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ హాజరవుతుండడంతో, ప్రభాస్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు సర్వసన్నద్ధమవుతున్నారు. అయితే, ఆ అభిమానులకు ప్రభాస్ షాక్ ఇచ్చాడు.
బింబిసార చేదు అనుభవంతోనే..
ఇటీవల ‘బింబిసార’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తన సోదరుడు కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే, అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు.
‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ అభిమాని మృతి చెందిన దరిమిలా, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వుండేందుకు ప్రభాస్, కీలక నిర్ణయం తీసుకున్నాడు. కేవలం మీడియా, సినిమా యూనిట్.. అతి కొద్దిమంది ఆహ్వానితులతోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని ప్రభాస్, ‘సీతారామం’ టీమ్‌ని కోరాడట. అందుకు వారు అంగీకరించారట.
సో, ప్రభాస్‌ని ప్రత్యక్షంగా చూసేందుకు, ‘సీతారామం’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యేందుకు అభిమానులకు అవకాశం లేదన్నమాట.