PRABHAS: ప్ర‌భాస్ పూర్తి స్థాయి డేట్స్ ప్ర‌శాంత్ నీల్ చేతుల్లోనే.. దాదాపు ఐదునెల‌లు స‌లార్ షూటింగ్‌తోనే డార్లింగ్ బిజీ

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమా కోసం దాదాపు ఐదేళ్లు కాల్షీట్స్ కేటాయించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ప్ర‌భాస్ త‌న త‌దుపరి సినిమాల‌ని పాన్ ఇండియా రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో ప్ర‌తి సినిమాకు సంవత్స‌రాల స‌మ‌యం ప‌డుతుంది. సాహోకి రెండేళ్లు స‌మ‌యం కేటాయించిన ప్ర‌భాస్ ఇప్పుడు రాధే శ్యామ్ , స‌లార్, ఆది పురుష్‌, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. అయితే క‌రోనా వ‌ల‌న ప్ర‌భాస్ క్యాలిక్యులేష‌న్స్ అన్నీ పూర్తిగా మారిపోయాయి.

గ‌త ఏడాది 9 నెల‌లు షూటింగ్ వాయిదా ప‌డ‌డం, ఈ ఏడాది కూడా లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్ ఆగిపోవ‌డంతో ప్ర‌భాస్ ఇప్పుడు ఏ సినిమాని ఎప్పుడు మొద‌లు పెట్టాలో తెలియ‌క గంద‌ర‌గోళంలో ఉన్నారు. అయితే కేజీఎఫ్ చిత్రంతో మంచి విజ‌యం సాధించిన ప్ర‌శాంత్ నీల్ స‌లార్ కోసం రానున్న రోజుల‌లో ఎక్కువ డేట్స్ కేటాయించే అవ‌కాశం క‌నిపిస్తుంది. సలార్ సినిమా లో ప్రభాస్ రెండు రోల్స్ లో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. రెండు రోల్స్ లో సీనియర్ ప్రభాస్ రోల్ మరో లెవల్ లో ఉంటుందని అంటున్నారు. ఆ పాత్ర మాస్ అనే పేరుకు అర్థం అన్నట్లుగా ముందు ముందు మాట్లాడుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న స‌లార్ చిత్రం కోసం ప్ర‌భాస్ ఐదు నెల‌ల పాటు డేట్స్ కేటాయిస్తాడ‌ట‌. ఈ ఐదు నెలల్లో సినిమా షూటింగ్ పూన్తి చేయాలని మేక‌ర్స్ భావిస్తున్నారు. తాజాగా స‌లార్ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో జాన్ అబ్ర‌హం విల‌న్‌గా న‌టిస్తాడ‌ని అంటున్నారు. ప్రభాస్ లోని మాస్ యాంగిల్ ను పూర్తిగా వినియోగించుకుంటూ సలార్ ను తెరకెక్కిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సలార్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా సెకండ్ వల్ల షూటింగ్ నిలిచి పోయింది. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో మ‌రి.