Prabhas : ఇటలీలో ప్రభాస్ లగ్జరీ విల్లా.. నెలకు రెంట్ ఎన్ని లక్షలో తెలుసా..?
NQ Staff - June 22, 2023 / 09:19 AM IST

Prabhas : ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా ఆయన రికార్డు సృష్టిస్తున్నాడు. ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల కంటే ఎక్కువగానే తీసుకుంటున్నాడు. అందుకే ఆయన సంపాదన కూడా అమాంతం పెరిగిపోయింది.
ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే ప్రభాస్ కు ఇటలీలో లగ్జరీ విల్లా ఉంది. ఆయన ఆదిపురుష్ మూవీ కంటే ముందే దీన్ని కొనుగోలు చేశారంట. తాను ఇటలీ వెళ్లినప్పుడల్లా అక్కడ గడిపేందుకు దీన్ని కొనుగోలు చేశారు.
తన ఫ్రెండ్స్ తో కలిసి తరచూ అక్కడకు వెళ్తుంటారు ప్రభాస్. అది కూడా తనకు క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ తోనే వెళ్లి ఎంజాయ్ చేస్తారు. అయితే ఆయన వెళ్లనప్పుడు దాన్ని రెంట్ కు ఇస్తారు. ఇదే విషయాన్ని నేషల్ మీడియా రాసుకొచ్చింది. ప్రభాస్ కు ఆ విల్లా ద్వారా నెలకు రూ.40లక్షల రెంట్ వస్తోందంట.
ఇదే విషయాన్ని స్థానిక మీడియా ఇచ్చిన సమాచారంతో రాసుకొచ్చినట్టు సదరు నేషనల్ మీడియా తెలిపింది. కాగా నేషనల్ మీడియా రాసిన ఈ కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రభాస్ కు ఈ విధంగా కూడా బాగానే ఆదాయం వస్తోందన్నమాట అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.