Prabhakar Comments On Niharika Konidela Divorce Issue : నిహారిక గురించి చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు.. మెగా డాటర్ వీరితో అలా ఉంటుందా?
NQ Staff - July 11, 2023 / 08:14 PM IST

Prabhakar Comments On Niharika Konidela Divorce Issue :
గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న జంట ఎవరంటే నిహారిక కొణిదెల – జొన్నలగడ్డ చైతన్య అనే చెప్పాలి. ఎందుకంటే ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ నోట్ షేర్ చేసారు. దీంతో ఎన్నో రోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పడింది.
2020లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమని మూడేళ్లు కూడా కలిసి ఉండకుండానే విడాకులు అంటూ కోర్టుకెక్కారు.. మెగా ఫ్యామిలీ కానీ అటు చైతన్య ఫ్యామిలీ కానీ ఈ జంటను కలిపి ఉంచలేక పోయింది. ఇద్దరు ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నట్టు ఈ ఇద్దరు ప్రకటించారు..
ఏది ప్రకటించిన కూడా ఈ ఇద్దరి మధ్య జరిగిన కారణాలు ఏంటి? ఎందుకు వీరు విడిపోయారు? ఏం జరిగింది? అనే విషయాల గురించి అంతా చర్చించు కుంటున్నారు. ఈ క్రమంలోనే చైతూ తండ్రి ఈ విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు టాక్ వచ్చింది. చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ నిహారిక గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు అని తెలుస్తుంది.
ఈయన సన్నిహితుల దగ్గర మాట్లాడుతూ.. మేము ఉద్యోగరీత్యా గౌరవమైన హోదాలో ఉన్నాం.. ఇంట్లో పెద్ద వాళ్లతో నిహారిక ఒక్క రోజు కూడా గౌరవంగా ఉండలేదని.. భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన ఏమాత్రం లేదని.. అత్తామామలను కూడా గౌరవించడం చేయదని.. పద్ధతిగా ఉండకుండా పబ్బులు, పార్టీలంటూ తిరుగుతుంది అని మెగా ఫ్యాన్స్ మాత్రం నిజం తెలుసుకోకుండా మా అబ్బాయి గురించి చెడుగా మాట్లాడుతున్నారని సన్నిహితుల దగ్గర చెప్పినట్టు టాక్.. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..