PRABHAS 24: మ‌రో సెన్సేష‌న్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసిన ప్ర‌భాస్.. ఫ్యాన్స్ లో పెరిగిన ఆస‌క్తి !

PRABHAS 24 టాలీవుడ్ హీరో ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. సాహో చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ లైన‌ప్ చూస్తుంటే అంద‌రికి ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. రీసెంట్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధే శ్యామ్ చిత్రాన్ని పూర్తి చేయ‌గా, ఈ మూవీ జూలై 30న విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌భాస్ స‌లార్, ఆదిపురుష్ అనే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. స‌లార్ చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తుండ‌గా, ఆదిపురుష్ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ రూపొందిస్తున్నాడు.

ప్ర‌భాస్ సాలిడ్ లైన‌ప్ చూసి అందరు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తుండ‌గా, తాజాగా ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిద్దార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. ఇది ప్ర‌భాస్ 24వ ప్రాజెక్ట్ కాగా, ఇది ఆల్‌మోస్ట్ ఫిక్స్ అయింద‌నే టాక్ వినిపిస్తుంది. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన భారీ నిర్మాణ సంస్థ‌నే ఈ మూవీని నిర్మిస్తుంద‌నే టాక్ న‌డుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

Advertisement