Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ ఆహారాన్ని ఇష్టంగా తింటాడో తెలుసా?

Pawan Kalyan ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ..ఆయ‌న పేరు ఓ ప్ర‌భంజ‌నం.త‌క్కువ సినిమాల‌తోనే ఎక్కువ ఇమేజ్ అందుకున్న‌ప‌వ‌న్ అజ్ఞాతవాసి చిత్రం తర్వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి రాజ‌కీయాల‌కు వెళ్లారు. మూడేళ్ల త‌ర్వాత వ‌కీల్ సాబ్ మూవీతో తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. ప‌వ‌న్ రీఎంట్రీతో అభిమానుల ఆనందం హ‌ద్దులు దాటింది. చాలా గ్యాప్ త‌ర్వాత న‌టించిన కూడా ప‌వ‌న్ లో స‌త్తా త‌గ్గ‌లేదు. వెండితెర‌ పై ఆయ‌న‌ను చూస్తున్నంత సేపు అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోయారు. ఇక ఇప్పుడు ఆయ‌న త‌ర్వాతి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప‌వ‌న్ న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంతో పాటు సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. ఇవి పూర్తైన త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, బండ్ల గ‌ణేష్ నిర్మాణంలో ఓ మూవీ చేయ‌నున్నాడు ప‌వ‌న్.

Pawan Kalyan

క‌రోనా నుండి కోలుకున్న త‌ర్వాత ప‌వన్ క‌ళ్యాణ్ ఇంటికే ప‌రిమితం అయ్యారు. పౌష్టికాహారం ఎక్కువ‌గా తీసుకుంటూ సంగీతంపై దృష్టి పెట్టారు. తన కొడుకు అకిరానందన్‌తో కలిసి సంగీతం నేర్చుకుంటున్నారట. ఇందుకోసం ఓ మ్యూజిక్ టీచర్‌ని కూడా పెట్టుకున్నారు. మ్యూజిక్ టీచ‌ర్ త‌న సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకుంటూ.. పవన్ కళ్యాణ్ అతని తనయుడు అకిరా తన వద్ద సంగీతం నేర్చుకుంటూ తనకి శిష్యులు కావడం చాలా ఆనందంగా ఉందని ఆయన వయొలిన్ బాగా వాయిస్తారని చెప్పుకొచ్చింది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫుడ్‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కావాలి అంటే ఎన్ని ర‌కాల వంట‌కాలైన నిమిషాల‌లో ఆయ‌న ముందుకు వ‌స్తాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్లు ఆయ‌నకు హోమ్ డెలివ‌రీ చేస్తారు. కాని వీరు వెండితెర‌పై అందంగా క‌నిపించేందుకు ఫుడ్ విష‌యంలో కొన్ని నియ‌మాలు పెట్టుకుంటారు. ఎన్నో తినాల‌నిపించిన‌ప్ప‌టికీ కొన్ని సార్లు నోరు క‌ట్టేసుకోవ‌ల‌సిన ప‌రిస్థితి. ప‌ర్‌ఫెక్ట్ డైట్ ను ఫాలో అయ్యే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. నెల్లూరు చాప‌ల పులుసు, నాటుకోడి చికెన్ క‌ర్రీని చాలా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. పులిహోర‌ని కూడా ప‌వ‌న్ ఇష్టంగా తింటాడ‌ని స‌మాచారం. త‌న కుక్ వండిన వంట‌ల‌కు ఏ మాత్రం వంక పెట్టుకుండా తింటుంటార‌న ప‌వ‌న్ . ప్ర‌స్తుతం రెస్ట్‌లో ఉన్న ప‌వ‌న్ లాక్ డౌన్ త‌ర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ ‘హరహర వీరమల్లు’ చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. బందిపోటు వీరోచిత గాథను విజువల్ వండర్‌గా చూపించబోతున్నారు క్రిష్. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్యద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతుంది.

Pawan Kalyan