కరోనా దెబ్బకు గతం మరిచిపోయిన బాలింత

Advertisement

కరోనా మహమ్మారి తో ప్రతిఒక్కరు కూడా విషాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ మహమ్మారి దాటికి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే.. ఈ తిప్పలు ఇంకా ఎన్ని నాళ్ళు అని బాధపడుతున్నారు. అయితే న్యూయార్క్‌లోని బ్రూక్లేన్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన గురించి తెలిస్తే తప్పకుండా కళ్ల నుండి నీరు వస్తాయి. వివరాల్లోకి వెళితే సెల్వియా (35) అనే మహిళ, బ్రూక్‌డాలే యూనివర్శిటీ హాస్పిటల్ మెడికల్ సెంటర్‌లో లేబర్ అండ్ డెలివరీ నర్సుగా పనిచేస్తోంది. అయితే ఆమె గర్భం దాల్చింది. అదే సమయంలో ఆమెకు కరోనా సోకింది. వైరస్‌కు చికిత్స పొందుతున్న రెండు వారాల తర్వాత ఏప్రిల్ 12న గుండె నొప్పితో బాధపడింది. ఆ సమయానికి ఆమె 30 వారాల గర్భవతి. ఆమె సాధారణ స్థితికి చేరిన తరువాత డాక్టర్లు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీసారు.

అయితే ఆ సమయంలో ఆమె ఆక్సిజన్ లేకుండా నాలుగు నిమిషాలు ఉండాల్సి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఆమె మెదడుకు గాయమైంది. ఆ గాయం వల్ల ఆమె గతాన్ని మరిచిపోయింది. తాను గర్భవతిననే విషయంగానీ.. తనకు వైరస్ సోకి ఆసుపత్రిలో ఉన్నాననే ధ్యాస కూడా ఆమెకు తెలీకుండా పోయింది. మౌనంగా బిత్తర చూపులు చూస్తున్న ఆమెను చూసి డాక్టర్లు షాకయ్యారు. ప్రస్తుతం ఆమె జ్ఞాపకశక్తిని తిరిగి తేవడానికి డాకర్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సెల్వియా తన భర్త మరియు మూడేళ్ల కుమారిడిని సైతం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here