Posani Krishna Murali Remarks About CM KCR Going Viral : ఏపీలో షూటింగ్స్ కోసం కేసీఆర్ కాళ్లు పట్టుకుంటా.. పోసాని వ్యాఖ్యలు వైరల్..!

NQ Staff - July 5, 2023 / 09:46 AM IST

Posani Krishna Murali Remarks About CM KCR Going Viral : ఏపీలో షూటింగ్స్ కోసం కేసీఆర్ కాళ్లు పట్టుకుంటా.. పోసాని వ్యాఖ్యలు వైరల్..!

Posani Krishna Murali Remarks About CM KCR Going Viral :

పోసాని కృష్ణ మురళి ఈ నడుమ సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఆయన ఎప్పటికప్పుడు సినీ ఇండస్ట్రీ గురించి, అలాగే రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఆయన చేసే కామెంట్లు ఎప్పటికప్పుడు సంచలనం రేపుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఆయన ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ సంస్థ చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు ఏపీలో షూటింగ్స్ చేయాలంటే కేసీఆర్‌ ను బతిమాలాలి. ఎందుకంటే ఆయన తెలంగాణలో స్థలం ఇచ్చాం కదా.. ఇక్కడే షూటింగ్స్ చేయండి అని అంటారు.

విచిత్రమైన పరిస్థితి..

ఈ విషయంలో ఆయన్ను ఒప్పించేందుకు ఆయన కాళ్లు పట్టుకుంటాను అంటూ సంచలన కామెంట్లు చేశాడు పోసాని. ఏపీలో అయితే ఉచితంగానే షూటింగులు చేసుకునే అవకాశం ఉంది. ఇది చిత్ర పరిశ్రమకు విచిత్రమైన పరిస్థితిగా మారిపోయింది. ఈ విషయంపై రెండు రాష్ట్రాల సీఎంలు ఒక అండర్ స్టాండింగ్ కు వస్తే పరిష్కారం ఉంటుందేమో.

ఏదేమైనా కోరితే కేసీఆర్ గారు సహకరిస్తారనే నమ్మకం నాకు ఉంది. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రిగా కేటీఆర్, రేవంత్ రెడ్డి ఎవరు ఉన్నా ప్రస్తుతం తెలంగాణ భవిష్యత్తు ఆయనతోనే ముడిపడి ఉందని చెప్పుకొచ్చాడు పోసాని కృష్ణమురళి. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us