Popular Singer Gaddar Passed Away : బ్రేకింగ్ : ప్రముఖ గాయకుడు గద్దర్ కన్నుమూత!

NQ Staff - August 6, 2023 / 04:12 PM IST

Popular Singer Gaddar Passed Away : బ్రేకింగ్ : ప్రముఖ గాయకుడు గద్దర్ కన్నుమూత!

Popular Singer Gaddar Passed Away :

తెలంగాణ వ్యాప్తంగా విషాదం చోటు చేసుకుంది.. ప్రముఖ గాయకుడు గద్దర్ కన్నుమూశారు.. ప్రజా గాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన అభిమానం సొంతం చేసుకున్నాడు గద్దర్.. మరి అలాంటి గాయకుడు కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే పలువురు సంతాపం తెలుపుతున్నారు.

గద్దర్ అంటే తెలియని తెలుగు ప్రజలు లేరు.. ఈయన పాడిన పాటలతో అందరిని మెప్పించారు.. ప్రజా గాయకుడిగా పేరు పొందిన ఈయన గత కొద్దీ రోజులుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు..

ఈ క్రమంలోనే గత కొద్దీ రోజులుగా ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నారు.. అయితే ఈయన తాజాగా కొద్దిసేపటి క్రితం కన్నుమూసినట్టు వైద్యులు ధ్రువీకరించారు.. ఆయన కొడుకు సూర్యం ఈ వార్తను అధికారికంగా తెలిపారు.

Popular Singer Gaddar Passed Away

Popular Singer Gaddar Passed Away

1949, జూన్ 5న జన్మించిన ఈయన తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించారు. ఈ తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఉద్యమానికే ఊపు తెచ్చారు.. ఆయన పాటలకు లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ రోజు గద్దర్ మరణవార్త విని ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు..

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us