Allu Arjun: పూర్ణ బుగ్గ కొర‌క‌డంతో… విల‌విల‌లాడిన అల్లు అర్జున్

Allu Arjun: ప్ర‌స్తుతం బుల్లితెర‌పై ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్న షో ఢీ. స‌క్సెస్ ఫుల్‌గా 12 సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్ర‌మం ప్ర‌స్తుతం 13వ సీజ‌న్ జ‌రుపుకుంటుంది. ఈ సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఫైన‌ల్ కార్య‌క్ర‌మానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. తాజాగా షోకి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, ఇందులో బ‌న్నీ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

poorna gives shock to allu arjun
poorna gives shock to allu arjun

ఈ డాన్స్ షోకి ప్రియ‌మ‌ణి, పూర్ణ, గ‌ణేశ్ మాస్టర్‌ న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. షో ప్రారంభంలో హోస్ట్ ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ బాగా డాన్స్ చేస్తే ప్రియ‌మ‌ణిగారు ఒక హ‌గ్ ఇస్తారు. అదే పూర్ణ‌గారైతే ద‌గ్గ‌ర‌కు పిలిచి బుగ్గ‌ను కొరుకుతారు అని అన్నాడు. అప్పుడు వెంట‌నే బ‌న్ని.. ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తే.. అని అన‌గానే, ప్రియ‌మ‌ణి, పూర్ణ‌లు షాకయ్యి తెగ న‌వ్వేశారు.

ఇక హైప‌ర్ ఆది మాట్లాడుతూ రుద్ర‌మదేవి చిత్రంలో బ‌న్నీ మాట్లాడిన డైలాగ్స్ గ‌మ్మునుండ‌వ‌య్యా ఓ టీమ్ స‌భ్యుల‌కు స‌రిపోతుంద‌ని వేదం సినిమాలో టీ ష‌ర్ట్ చూడ‌గానే తెలిసిపోతుంద‌నే డైలాగ్ మరో టీమ్‌కు స‌రిపోతుంద‌ని సెటైర్స్ వేసి అంద‌రినీ న‌వ్వించాడు. ఇక షోలో భాగంగా ఓ టీమ్ బ‌న్నీ హీరోగా న‌టించిన తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఏదో ఒక రాగం వింటున్న పాట‌కు పెర్ఫామ్ చేశారు.

poorna gives shock to allu arjun1
poorna gives shock to allu arjun1

గ్రూపులో మెయిన్‌గా వ్య‌వ‌హ‌రించిన అమ్మాయిని పూర్ణ ద‌గ్గర‌కు పిలిచి బుగ్గ కొరికింది. దానికి బ‌న్నీ కూడా నొప్పితో విల‌విల‌లాడిన‌ట్లు రియాక్ట్ అవుతూ బుగ్గ తుడుచుకోవడం కొసమెరుపు. దీనిపై బ‌న్నీ మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎంతో అదృష్ట‌వంతురాలు.. ఎందుకంటే ఇంత‌కంటే ఎక్కువ డాన్స్ చేసుంటే ఏమైపోయేదో అని అన్నాడు. దానికి పూర్ణ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వింది.

ఢీ 13 గ్రాండ్ ఫినాలెలో బ‌న్నీ న‌టించిన సినిమాలోని పాట‌ల‌ను ప్రత్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. ఆ ప్ర‌ద‌ర్శ‌న‌ను చూసి ఎంజాయ్ చేసిన బ‌న్ని.. నాకెంతో స్పెష‌ల్‌గా ఉంద‌ని మురిసిపోయారు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో డిసెంబ‌ర్ 17న విడుద‌ల‌కు స‌న్నద్ధ‌మ‌వుతుంది చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కింది.