Poonam Bajwa : తెలుగు దర్శకుడితో ప్రేమలో పడ్డ పూనర్ బజ్వా.. మా పెళ్లి అప్పుడే అంటూ..?

NQ Staff - November 6, 2022 / 03:55 PM IST

Poonam Bajwa : తెలుగు దర్శకుడితో ప్రేమలో పడ్డ పూనర్ బజ్వా.. మా పెళ్లి అప్పుడే అంటూ..?

Poonam Bajwa : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. అయితే, ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి రైజింగ్‌లో ఉన్న ఓ హాట్ బ్యూటీ తాజాగా తెలుగు దర్శకుడితో ప్రేమలో పడ్డట్టు తెలిపింది. వీరిద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఇంతకూ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? ఆమె మరెవరో కాదు హీరోయిన్ పూనమ్ బజ్వా..

అంతలోనే ఇంత క్లోజ్ అయిపోయారా..

పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. గతంలో హీరో నవదీప్‌తో వరుసగా సినిమాలు చేసింది. ఈమె నటనకు ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఆమె అందచందాలతో కుర్రకారును తనవైపునకు తిప్పుకుంది. పూనమ్ గ్లామర్ పరంగా ఎంత బాగున్నా ఎందుకో ఆమె స్టార్ ఇమేజ్ మాత్రం నేటికీ రాలేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా రచ్చ చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తమిళంలో బోల్డ్ పాత్రల్లో కూడా కనిపిస్తోంది.

ముంబై‌లో జన్మించినఈ పంజాబీ ముద్దుగుమ్మ 2005లో మిస్ పూణెగా ఎంపికవ్వడం.. ఆమెకు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఓవైపు చదువుకుంటూనే మరో వైపు మాడలింగ్ చేసిన పూనమ్.. ఇంటర్ చదువుతున్న టైంలో హైదరాబాద్‌లో ర్యాంప్ వాక్ కోసం రాగా.. దర్శకుడు కూచిపూడి వెంకట్ ఆమె అందానికి ఫిదా అయ్యాడు. సినిమాల్లో నటిస్తావా? అని అడిగి ఏకంగా అవకాశం ఇచ్చేశాడు.

అలా నవదీప్‌ సరసన హీరోయిన్‌గా చేసిన పూనమ్.. తన చదువును కూడా కొనసాగించింది. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన పూనమ్.. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళంలో కలిపి మొత్తంగా 30కు పైగా సినిమాలు చేసింది.

35 ఏళ్లు దాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోని పూనమ్.. కరోనా టైంలో తెలుగు డైరెక్టర్‌తో ప్రేమలో పడింది. వీరి ఫోటోలు తెగ వైరల్ అవ్వడంతో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్టు పూనమ్ ఎట్టకేలకు ప్రకటించింది. త్వరలోన మా పెళ్లి ఉంటుందని కూడా తెలిపింది. ఇక సునీల్ కుమార్ గత 20 ఏళ్లుగా దర్శకుడిగా కొనసాగుతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us