Pooja Hegde : పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ.. గుంటూరు కారం షాక్
NQ Staff - June 22, 2023 / 09:11 PM IST

Pooja Hegde : అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ ఖతం అయ్యిందా అంటే ఔను అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పూజా హెగ్డే చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చుతూనే ఉంది. ఆకట్టుకునే కథ మరియు కథనాలు ఈ అమ్మడు ఎంపిక చేసుకోవడంలో విఫలం అవుతోంది.
గుంటూరు కారం సినిమాతో ఈ అమ్మడు కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా పూజా హెగ్డే కి దెబ్బ పడింది. గుంటూరు కారం సినిమా లో హీరోయిన్ గా ఎంపిక అయిన ఈమె ఇటీవల తప్పించినట్లుగా తెలుస్తోంది.
పూజా హెగ్డే ను మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. కానీ మహేష్ బాబు చెప్పినట్లుగా పూజా హెగ్డే ను తప్పించి శ్రీ లీలను మొదటి హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. దాంతో పూజా హెగ్డే సినీ కెరీర్ ఖతం అయ్యిందా అనేది చర్చ జరుగుతోంది.

Pooja Hegde Removed From Guntur Karam Movie
రాధేశ్యామ్ తో పాటు హిందీ లో సల్మాన్ ఖాన్ సినిమా తో కూడా సక్సెస్ ను సొంతం చేసుకోలేక పోయిన ఈ అమ్మడు ముందు ముందు అయినా కనీసం సక్సెస్ లను సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.