Pooja Hegde Reacts On Casting Couch : అలాంటి దుర్మార్గులే కమిట్ మెంట్లు అడుగుతారు.. పూజాహెగ్డే సెన్సేషనల్..!
NQ Staff - August 3, 2023 / 01:10 PM IST
Pooja Hegde Reacts On Casting Couch :
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది కాస్టింగ్ కౌచ్ మీద స్పందిస్తున్నారు. అయితే ఇందులో కొందరు తమను వేధించారని చెబుతుంటే.. మరికొందరు మాత్రం తమకు అలాంటివి ఎదురు కాలేదంటూ జవాబిస్తున్నారు. ముఖ్యంగా మీటూ ఉద్యమం నుంచే ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కూడా దీనిపై స్పందించింది. ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ యాక్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు సౌత్ లో పెద్దగా ఆఫర్లు రావట్లేదు. పైగా వచ్చినవి కూడా తిరిగి వెళ్లిపోతున్నాయి. దాంతో ఆమె పూర్తిగా బాలీవుడ్ మీదనే ఫోకస్ పెడుతోంది.
ఆ ప్రశ్న ఎదురు కావడంతో..
అయితే తాజాగా ఆమె ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేసింది. ఇందులో ఆమె కాస్టింగ్ కౌచ్ ప్రశ్న ఎదురు కాగా.. దానిపై కూడా వివరణ ఇచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతోంది. కానీ ఇప్పటి వరకు నాకు అది ఎదురు కాలేదు.
చాలామంది నా ఫ్రెండ్స్ ఇలాంటివి ఫేస్ చేశామని చెబితే చాలా బాధగా అనిపిస్తుంది. అలాంటి దుర్మార్గులను అస్సలు క్షమించ కూడదు. ఇండస్ట్రీకి ఎన్నో ఆశలతో వస్తుంటారు. మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, పెద్ద నటి కావాలనే ఆశలతో వస్తుంటారు. అలాంటి వారిని ఇబ్బంది పెడితే అది ఇండస్ట్రీకి మంచిది కాదు అంటూ సెన్సేషనల్ కామెంట్లు చేసింది ఈ బ్యూటీ.