Pooja Hegde : గతేడాది గడ్డుకాలం వెళ్ళదీసిన పూజా హెగ్డే. ఈ ఏడాది సల్మాన్, మహేష్ సినిమాలపైనే ఆశలన్నీ

NQ Staff - January 28, 2023 / 11:06 AM IST

Pooja Hegde : గతేడాది గడ్డుకాలం వెళ్ళదీసిన పూజా హెగ్డే. ఈ ఏడాది సల్మాన్, మహేష్ సినిమాలపైనే ఆశలన్నీ

Pooja Hegde : వరుస సక్సెసులతో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న టైమ్ లో గ్యాప్ లేకుండా గతేడాది రిలీజైన సినిమాలన్నీ సిల్వర్ స్క్రీన్ జిగేల్ రాణికి పెద్ద కష్టాలే తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేకుండా నటించిన అన్నిభాషల సినిమాలు షాకులే ఇచ్చాయి పూజాహెగ్డేకి. ప్రభాస్ కి జోడీగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన రాధేశ్యామ్ మూవీలో నటించి ఆ మూవీపై చాలా హోప్స్ పెట్టకుంది. కానీ విడుదలైన్న అన్ని లాంగ్వేజుల్లోనూ ఫ్లాప్ టాకే మూటగట్టుకుంది.

దళపతి విజయ్ తో కలిసి నటించిన కోలీవుడ్ మూవీ బీస్ట్ కూడా ఆడియెన్స్ చేత వరస్ట్ టాక్ తెచ్చుకుని రోస్ట్ కాబడింది. తెలుగులో చిరు, చరణ్ ఫస్ట్ టైమ్ కలిసి నటించిన సినిమా అయిన ఆచార్య మూవీలో నీలాంబరిగా యాక్ట్ చేసింది. దాంతో బంపర్ మెగా హిట్ దక్కుతుందని ప్లాన్స్ వేస్తే ఆ సినిమా కాస్తా పాదఘట్టంలో కలిసిపోయింది. బాలీవుడ్లో రణ్ బీర్ తో జోడీ కట్టిన సర్కస్ మూవీ యునానిమస్ గా డిజాస్టర్ టాక్ దక్కించుకుంది.

సినిమాలనే కాదు.. ఆఖరికి స్పెషల్ సాంగ్ చేసిన ఎఫ్ త్రీ కూడా పెద్దగా ఆడలేదు. అంతలా లాస్ట్ ఇయర్ పూజా హెగ్డేకి కలిసిరాలేదు. మరీ దారుణం ఏంటంటే.. లైగర్ రిజల్ట్ ఘోరంగా తేడా కొట్టడంతో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబో ప్రాజెక్ట్ JGM కూడా షూట్ స్టార్టయి మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఎలాగైనా సరే ఈ ఏడాదిలో హిట్స్ దక్కించుకోవాలన్న ఆశతో ఉంది పూజా.

సల్మాన్ ఖాన్ హీరోగా వస్తోన్న కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్సే వస్తోంది. రంజాన్ స్పెషల్ గా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ మూవీతో బాలీవుడ్లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ఫిక్సయింది పూజా.

Pooja Hegde Is Busy Shooting For SSMB 28

Pooja Hegde Is Busy Shooting For SSMB 28

ఇక త్రివిక్రమ్ గత సినిమాల్లో హీరోయిన్ గా నటించి హిట్స్ కొట్టడంతో ఆ సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేసే ప్లాన్ లోనూ ఉంది. మహేష్ బాబు 28 వ చిత్రంగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ షూట్ లో బిజీగానూ ఉంది. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ మూవీ వర్కవుట్ అయితే టాలీవుడ్లోనూ స్టార్ హీరోయిన్ గా మళ్లీ ఫామ్ లోకి రావడం పక్కా.

ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా ప్రస్తుతం మరికొన్ని సినిమాల పైన కూడా ఫోకస్ చేస్తోందట పూజా. సౌత్, ప్లస్ బాలీవుడ్ అన్నిచోట్లా ఫ్లాపులే పడుతుండడంతో కెరీర్ మళ్లీ స్టార్టిండ్ డేస్ లా మారిపోకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలనుకుంటోంది. మరి ఈ ఏడాది పూజాకి ఈ రెండు ప్రాజెక్టులతో రెండు ఇండస్ట్రీల్లోనూ ఎలాంటి రిజల్ట్ వస్తుందో వేచి చూడాలి మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us