Ponguleti Srinivas : పొంగులేటి కాంగ్రెస్ ఎంట్రీ ముహూర్తం ఖరారు
NQ Staff - June 17, 2023 / 03:39 PM IST

Ponguleti Srinivas : బీఆర్‌ఎస్ బహిసృత నేతలు పొంగులేటి శ్రీనివాస్.. జూపల్లి త్వరలో కాంగ్రెస్ లో జాయిన్ అవ్వబోతున్నారనే విషయం తెల్సిందే. ఢిల్లీలో ఈ నెల 22న రాహుల్ గాంధీ తో భేటీ కానున్న పొంగులేటి, జూపల్లి, కూచూకుళ్ళ దామోదర రెడ్డి, పిడమర్తి రవి తదితరులు.
ప్రియాంక గాంధీ.. రాహుల్ గాంధీలతో వేరు వేరుగా బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఆ సభల్లో కాంగ్రెస్ కండువాను కప్పుకునేందుకు ఈ నాయకులు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక గాంధీ మరియు రాహుల్ గాంధీ టైమ్ కోసం చర్చలు జరుగుతున్నాయి.
ఈనెల 30న ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు గాను పొంగులేటి సిద్ధం అవుతున్నాడు అంటూ సమాచారం అందుతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున తన మద్దతుదారులను సమీకరించి తన బలం ను చూపించేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నాడట.
ఖమ్మం సభలో ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఖమ్మం సభకు వస్తారు అనేది త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది. పొంగులేటితో పాటే కాంగ్రెస్ లో చేరనున్న పాయం వేంకటేశ్వర్లు, కోరం కనకయ్య, పిడమర్తి రవి, తెల్లం వెంకట్రావు, బానోత్ విజయాబాయి, కోటా రాంబాబు, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, కొండూరి సుధాకర్, జారే ఆదినారాయణ, దొడ్డా నగేష్ యాదవ్.