Munugodu By Election : మునుగోడు బై పోల్: పెరుగుతున్న ఓటింగ్ దేనికి సంకేతం.?

NQ Staff - November 3, 2022 / 06:13 PM IST

Munugodu By Election : మునుగోడు బై పోల్: పెరుగుతున్న ఓటింగ్ దేనికి సంకేతం.?

Munugodu By Election : మునుగోడు ఉప ఎన్నికలో ఆసక్తికరమైన రీతిలో పోలింగ్ నమోదవుతోంది. మధ్యాహ్నం తర్వాత అనూహ్యంగా ఓటింగ్ పుంజుకోవడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన బయల్దేరింది. సాయంత్రం 5 గంటల సమయానికి ఓటింగ్ ఏకంగా 77 శాతం దాటిందని అధికారులు చెబుతున్నారు.

గత ఎన్నికల్లో.. అంటే, 2018 ఎన్నికల్లో దాదాపు 91 శాతం ఓటింగ్ మునుగోడులో నమోదైనట్లు తెలుస్తోంది. ఈసారి 95 శాతం వరకూ ఓటింగ్ నమోదవ్వచ్చని అంచనా వేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల్లోని క్యూలైన్లు మరింత రద్దీగా మారాయి.

ఓటింగ్ పెరిగితే ఎవరికి దెబ్బ.?

ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా వుందనీ.. అందుకే ఓటింగ్ పెరిగిందని బీజేపీ విశ్లేషించు కుంటోంది. మరోపక్క, పెరిగిన ఓటింగ్ తమకే అనుకూలమన్న భావనతో టీఆర్ఎస్ కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ సందడి పెద్దగా కనిపించడం లేదు.

ఆటలో అరటిపండు.. అని అంతా అనుకున్న కేఏ పాల్, పోలింగ్ కేంద్రాల దగ్గర షరామామూలుగానే హంగామా కొనసాగిస్తున్నారు. కాగా, సాయంత్రం వరకూ కూడా ప్రలోభాల పర్వం కొనసాగుతూనే వుంది. గుంపులు గుంపులుగా ఓటర్లను తీసుకెళ్ళి బుజ్జగిస్తున్నారు ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల అనుచరులు.
మొత్తమ్మీద, మునుగోడు ఉప ఎన్నిక అంతా ఊహించినదాని కన్నా రంజుగానే జరుగుతోందన్న మాట.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us