Andhra Pradesh : బూతులు.. కామాంధులు.. రౌడీలు.! ఇవేం పార్టీలు మహాప్రభో.!

NQ Staff - November 22, 2022 / 09:19 PM IST

Andhra Pradesh : బూతులు.. కామాంధులు.. రౌడీలు.! ఇవేం పార్టీలు మహాప్రభో.!

Andhra Pradesh : దేశంలో చాలా రాష్ట్రాల్లో రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో వున్నంత జుగుప్సాకరంగా అయితే కాదు. ముఖ్యమంత్రి పీఠమెక్కాలనుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చెప్పు చూపించి మరీ ‘రండ్రా నా కొడకల్లారా..’ అంటూ విరుచుకుపడిపోతున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే, ‘బోసడీకే’ అనే తిట్టు తాలూకు అర్థాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తెలుగుదేశం పార్టీ అధినేత సంగతి సరే సరి.! ఏం జరుగుతోంది ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో.?

ఆవు చేలో మేస్తోంటే.. దూడ గట్టున మేస్తోందా.?

సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకునే చంద్రబాబు.. ముఖ్యమంత్రి పదవిలో వున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాజకీయాల్లో మార్పు తెస్తానంటున్న పవన్ కళ్యాణ్.. ఎవరూ తగ్గడం లేదు. రాష్ట్రంలో రాజకీయాల్ని కలుషితం చేసి పారేశారు.

ఆంధ్రప్రదేశ్ అనగానే బూతులు (టీడీపీ), కామాంధులు (వైసీపీ), రౌడీలు (జనసేన) గుర్తుకొచ్చేలా, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది.? అది మాత్రం ఎవరికీ తెలియదు.! రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియని అయోమయం.. అయినాగానీ, నిస్సిగ్గు రాజకీయం.!

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us