Bollineni Sridhar : సువర్ణ భూమి ఎండీపై చీటింగ్ కేసు.. మరో ఐదుగురిపై కూడా..

NQ Staff - June 15, 2023 / 12:38 PM IST

Bollineni Sridhar : సువర్ణ భూమి ఎండీపై చీటింగ్ కేసు.. మరో ఐదుగురిపై కూడా..

Bollineni Sridhar : ఈ మధ్య మోసాలు ఎక్కువ అవుతున్నాయి.. ఎంతసేపటికి డబ్బు తీసుకోవడం ఆ తర్వాత మోసం చేయడం కామన్ అయిపొయింది.. పెద్ద పెద్ద వారు కూడా మోసానికి పాల్పడడం గమనార్హం.. మరి తాజాగా మరో పెద్ద పేరు ప్రఖ్యాతలు తీసుకున్న వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బొల్లినేని శ్రీధర్ తో పాటు ఆ సంస్థ ఉద్యోగులపై కేసు నమోదు అయ్యింది.

ప్లాట్లు ఇస్తామని డబ్బు తీసుకుని మోసం చేసారంటూ పలువురు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి గురించి చాలా మందికి తెలుసు.. మరి పెద్ద పొజిషన్ లో ఉండి ఇలా మోసం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్లాట్లు విక్రయిస్తామని పలువురి దగ్గర నుండి పెద్ద ఎత్తున డబ్బు తీసుకున్నారట.

అయితే డబ్బు తీసుకున్న తర్వాత మొహం చాటేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్ తో పాటు మరో ఐదుగురిపై చీటింగ్ కేసు నమోదు చేసారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 5 లో సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో వెంచర్ స్టార్ట్ చేసారు..

2017లో షాద్ నగర్ సమీపంలో వెంచర్ వేసి ఫ్లాట్ల విక్రయాలు చేసారు. ఇందులో 21మంది 50 లక్షల నగదు చెల్లించి ప్లాట్ కొనుగోలు చేసారు. 2022లో కొనుగోలు చేసిన వారికీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి అలా చేయలేదు.. బాధితులు కార్యాలయానికి వెళ్లి అడగడంతో అందులో కొన్ని మాత్రమే అసలు ఉన్నాయి.. మిగిలిన వాటితో తమకు సంబంధం లేదని సంస్థ తెలిపింది. దీంతో బాధితులు వీరిపై కేసు పెట్టారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us