Chintapandu: చిక్కుల్లో ‘చింతపండు’..

Chintapandu: క్యూ టీవీ నిర్వాహకుడు చింతపండు నవీన్ కుమార్ చిక్కుల్లో పడ్డాడు. అతనిపై చిలకలగూడ పోలీసులు మొన్న శుక్రవారం కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ కి దగ్గరలోని సీతాఫల్ మండి పరిధి కిందికి వచ్చే మధురా నగర్ కాలనీలో నివాసం ఉండే లక్ష్మీకాంత్ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు బుక్ చేశారు. లక్ష్మీకాంత శర్మ ‘మారుతీ జ్యోతిష్యాలయం’ను నడుపుతున్నాడు. అతనికి చింతపండు నవీన్ కుమార్ ఈ నెల 19వ తేదీన ఫోన్ చేసి రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే ఫేక్ న్యూస్ స్టోరీలను తన ఛానల్ లో టెలికాస్ట్ చేస్తానని బెదిరించాడు. లక్ష్మీకాంతశర్మ మాత్రం అతను అడిగినంత డబ్బు ఇవ్వలేదు. దీంతో వార్నింగ్ ఇచ్చిన తెల్లారే అంటే 20వ తేదీన తప్పుడు కథనాలను ప్రసారం చేశాడు. దీంతో 22వ తేదీన రాత్రి లక్ష్మీకాంతశర్మ పోలీసులకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో వాళ్లు చింతపండు నవీన్ కుమార్ పై ఐపీసీ-387, ఐపీసీ-504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని సీఐ నరేష్ తెలిపారు.

 

ఇంకా మారలేదా?..

చింతపండు నవీన్ కుమార్ ఇటీవలి తెలంగాణ రాష్ట్రంలోని శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసి ఊహించనివిధంగా ఓట్లు సంపాదించి వార్తల్లో నిలిచాడు. ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానం సంపాదించుకున్నాడు. క్యూ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజూ ప్రజల్లో ఉంటూ ఫేమస్ అయ్యాడు. తెల్లారింది మొదలు తెలంగాణ సీఎం కేసీఆర్ ని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయటమే ఈ చింతపండు నవీన్ కుమార్ పని. నోటికొచ్చిన భాష వాడటం ఇతని స్టైల్. తనని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నాడని బిల్డప్ ఇస్తుంటాడు. ఈ ఛానల్ ని అడ్డం పెట్టుకొని ప్రజాప్రతినిధులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని టాక్. ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నో నీతులు చెప్పిన ఇతను తన అసలు స్వరూపాన్ని మాత్రం మార్చుకోలేదని దీన్నిబట్టి తెలుస్తోంది.

ఇతనెవరు?..

చింతపండు నవీన్ కుమార్ గొప్పగా చెప్పుకునే పేరు త్రీ మార్ మల్లన్న. ఛే నంబర్ కలిగిన ఓ టీవీ ఛానల్ లో ఉన్నప్పుడు ‘మూడు మార్’ పేరుతో ప్రోగ్రామ్స్ చేసేవాడు. అలా పాపులర్ అయ్యాడు. ఆ టీవీ నుంచి బయటికి వచ్చాక కూడా అదే బ్రాండుతో బతుకుతున్నాడు. అందువల్ల ఈ చింతపండు నవీన్ కుమార్ అంటే ఎవరు అని డౌట్ పడొద్దు.

Advertisement