బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు, చలో అమలాపురం భగ్నం

Advertisement

అంతర్వేదిలో రథం దగ్ధం అయిన ఘటనలో ఏపీలో సంచలనం సృష్టించింది. దీనిపై ఇప్పటికే ఉన్నత అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన పట్ల చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతర్వేది ఘటనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నేడు చలో అమలాపురంకు పిలుపునిచ్చారు. అయితే చలో అమలాపురంను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలను ఎక్కడికి అక్కడే అరెస్ట్ చేస్తున్నారు.

కోనసీమలో నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నందున చలో అమలాపురానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లి కరకట్ట వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును గృహ నిర్బంధం చేశారు. అలాగే భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డిని ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు.

బీజేపీ అంతర్వేది ఘటన రాజకీయం చేస్తుందా!

అంతర్వేది ఘటనను బీజేపీ రాజకీయం చేస్తుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ఉన్నత అధికారులు విచారణ చేస్తున్నప్పటికీ బీజేపీ నాయకులు ఇలా ప్రవర్తించడం తగదని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీని దెబ్బతీయడానికే బీజేపీ నేతలు ఈ ఘటనను కులాలకు, మతాలకు అంటకడుతున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here