జగన్ + చంద్రబాబు : అసెంబ్లీ సాక్షిగా ఇద్దరూ అడ్డంగా దొరికారు?
Ajay G - December 2, 2020 / 09:23 PM IST

వెనకటికి ఓ సామెత ఉండేది.. అది కరెక్ట్ గా టీడీపీ, వైసీపీలకు సరిపోతుంది. కానీ.. ఆ సామెత అస్సలు గుర్తురావడం లేదు. సర్లే.. గుర్తొచ్చినప్పుడు చెప్పుకుందాం కానీ.. రాజకీయాలంటేనే ఇలా ఉంటాయా? ఎవరైనా అంతేనా? అని అనిపిస్తోంది ఏపీ ప్రజలకు.

polavaram issue raised in ap assembly
ఎందుకంటే.. ఏపీ రాష్ట్రానికే ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం. కానీ.. ఆ ప్రాజెక్టు గురించి ఏ ప్రభుత్వమూ సీరియస్ గా ఉన్నట్టు లేదు. అందుకే.. వైఎస్సార్ కాలం నుంచి ఇప్పుడు జగన్ హయాం వరకు అలాగే పెండింగ్ లో ఉంది. దాని నిర్మాణం కోసం వేల కోట్ల ప్రజాధనం మాత్రం నీళ్లలా ఖర్చవుతోంది కానీ.. ప్రాజెక్టు మాత్రం పూర్తవడం లేదు.
ఇక.. అసెంబ్లీలో పోలవరం ప్రస్తావన వస్తే చాలు.. నువ్వంటే నువ్వు.. నువ్వే తప్పు చేశావ్.. అంటే లేదు… నువ్వే తప్పు చేశావ్.. అంటూ ఒకరినొకరు ఆడిపోసుకోవడమే కానీ.. ఎవ్వరూ అసలు పోలవరం ప్రాజెక్టు గురించిన అసలైన వాస్తవాలు మాత్రం చెప్పడం లేదు.
అసలు.. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి.. అనేదానిపై ఏపీ ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు.. సరైన లెక్కలు చెప్పడం లేదెందుకు అంటూ టీడీపీ ఆరోపిస్తోంది.
టీడీపీ దాడికి ప్రతిదాడి బాగానే జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు గురించి టీడీపీ హయాంలోనే అస్సలు పట్టించుకోలేదు. ముంపు ప్రాంతాల పునరావాసం గురించి టీడీపీ ఏనాడూ ఆలోచించలేదు.. అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరైన సమయానికి రావట్లేవు. ఇప్పటికే.. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టింది.. అంటూ ఏపీ ప్రభుత్వం మొత్తుకుంటోంది. అయితే.. ఇక్కడ ఉన్న సమస్య కేంద్రంతో. కాబట్టి.. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే.. కేంద్రం మెడలు వంచాలి. దానికోసం… ఏపీ మొత్తం ఏకం కావాలి.. అంటే ఏపీ రాజకీయ పార్టీలన్నీ ఏకమై.. కేంద్రం వద్ద ఒత్తిడి తేవాలి కానీ.. వీళ్లు వీళ్లు కొట్టుకుంటే ఏమొస్తది?