రామజన్మ భూమికి ఈరోజు తో విముక్తి
Admin - August 5, 2020 / 10:33 AM IST

అయోధ్యలో నేడు రామమందిరానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ.. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. కొన్ని వందల ఏళ్ళ నిరీక్షణ నేటి తో ముగిసింది అని చెప్పాడు. అలాగే దేశ ప్రజల అండదండలతోనే రామ మందిర నిర్మాణం జరుపుకుంటున్నాం అని కొనియాడారు. ఈ రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, బలిదానాలు చేశారని చెప్పారు. వారందరి త్యాగాలతోనే నేడు రామమందిర నిర్మాణం సాధ్యమైందని అన్నాడు. అలాగే దేశంలో ఉన్న 130 కోట్ల మంది భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు.
దేశం కోసం పోరాటం చేస్తే స్వాతంత్రం వచ్చిందని తెలిపాడు. అదే క్రమంలో రామ మందిరం కోసం కూడా పోరాటం జరిగిందని అన్నాడు. అలాగే కోటాను కోట్ల హిందువులకు ఆలయ నిర్మాణం ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. ఈరోజు దేశమంతా కూడా రామమయం అయిందని వ్యాఖ్యానించారు. ఒక్క దేశంలోనే కాకుండా ప్రపంచమంతా జై శ్రీ రామ్ నినాదాలు వినిపిస్తున్నాయి అని మోడీ అన్నారు.