భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే గేమ్స్ తయారు చేయాలి: మోడీ

Advertisement

మన్ కి బాత్ ద్వారా భారతీయులతో మాట్లాడిన ప్రధాని మోడీ పిల్లలు, పెద్దలు ఆడుకునేలా గేమ్స్ ను రూపొందించాలని, ఇప్పుడున్న గేమ్స్ లలో పాశ్చాత్య ధోరణి ఉందని, భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా గేమ్స్ ను రూపొందించాలని, దీని కోసం దేశ యువత సిద్ధపడాలని సూచించారు. అలాగే బొమ్మలు తయారుచేయడంలో భారత్ చాలా వెనకపడిందని, ఈ రంగంలో కూడా యువత ముందుకు రావాలని సూచించారు.

కరోనా వేళ కూడా రైతులు కష్టపడి సాగుచేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నదాతలపై ప్రశంసలు కురిపించారు. రైతుల కృషిని కొనియాడుతూ మన వేదాల్లోనూ శ్లోకాలున్నాయని గుర్తుచేశారు. ఈ ఖరీఫ్‌లో గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారని తెలిపారు. ఈ కరోనా కాలంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని దేశ ప్రజలకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here